Reading Time: 2 minutes

Ravi Teja: U/A సర్టిఫికెట్తో థియేటర్లోకి ‘ఇరుముడి’.. పెయిడ్ ప్రీమియర్లపై మేకర్స్ కీలక నిర్ణయం!

Caption of Image.

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒక పూర్తిగా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ ‘ఇరుముడి’ ఆగష్టు 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించగా, ఇందులో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజై భారీ హైప్ తీసుకొచ్చింది. దీంతో ఈ సినిమాపై టాలీవుడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

U/A సర్టిఫికెట్తో థియేటర్లోకి

ఈ నేపథ్యంలోనే ‘ఇరుముడి’కు సెన్సార్ క్లియరెన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అఫీషియల్‌గా U/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి మార్గం సుగమమైంది. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. 

పెయిడ్ ప్రీమియర్లపై క్లారిటీ..

ఇటీవల కాలంలో చిన్న, పెద్ద సినిమారేం తేడా లేకుండా ఇండియాలో పెయిడ్ ప్రీమియర్లు వేయడం ట్రెండ్‌గా మారింది. అయితే, ప్రొడక్ట్ బాగోకపోతే లేదా ముందుగానే ట్విస్టులు బయటికి వస్తే అది సినిమా రిజల్ట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ కావడం వల్ల, ముందుగానే కీలకమైన ట్విస్టులు బయటికి వస్తే ఫస్ట్ డే నుంచి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు సినిమాను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేరని దర్శకుడు శివ నిర్వాణ అభిప్రాయపడ్డారు.

►ALSO READ | Box Office War: త్రివిక్రమ్ vs సీఎం విజయ్ కుమారుడు.. బాక్సాఫీస్‌ వార్లో గెలిచేది ఎవరు?

అంతేకాకుండా, సోషల్ మీడియాలో కొందరు క్లిప్‌లు రికార్డ్ చేసి షేర్ చేసే ప్రమాదం ఉన్నందున.. ‘ఇరుముడి’ టీమ్ ఇండియాలో పెయిడ్ ప్రీమియర్లను రద్దు చేసుకుంది. ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ఎలాంటి ముందస్తు ప్రీమియర్లు లేకుండా నేరుగా శుక్రవారం (ఆగష్టు 21న) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. 

ఓపెనింగ్స్ & బుకింగ్స్: సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, రేపు ఉదయం 11.04 లోపు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ లేకుండా దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజకు ఈ సినిమాతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి!

©️ VIL Media Pvt Ltd.