
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ తొలి సినిమా అర్జున్ రెడ్డి రీమేక్ అదిత్య వర్మతో వెండితెరకు పరిచయమయి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత కొంతకాలంగా మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్ ప్రేమలో ఉన్నట్టు పుకార్లు షికార్లు చేసాయి. కానీ ఇటీవల ధృవ్ తో విడిపోయి పరోక్షంగా అతనిపై సెన్సేషన్ కామెంట్స్ చేసింది అనుపమ. దాంతో ధృవ్ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ఓ రేంజ్ లో జరిగింది.
ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తమిళ యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ స్పందించారు. తమిల్ మీడియాతో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నేను సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడే ఇలాంటి విమర్శలు, ట్రోలింగ్స్ ఎదురవుతాయని తనకు ముందుగానే తెలుసు. ఎలాంటి విమర్శలు అయిన సరే తట్టుకోవాలని నాకు తెలుసు. అయితే కొన్నిసార్లు కొన్ని మాటలు ఎంతో మానసిక ఒత్తిడికి, తలనొప్పులకు గురిచేస్తాయి. ఇటీవల అలంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రేమించే వారిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మనం నిజాయితీగా ఉన్నంతకాలం ఎంతటి విమర్శలైనా కొట్టుకుపోతాయి. ముఖ్యంగా కష్టసమయాల్లో తనవెంటే ఉంటూ నిరంతరం ప్రోత్సహించిన అభిమానుల మద్దతే తనకు కొండంత బలాన్ని ఇచ్చిందని’ అన్నారు. అయితే ఈ కామెంట్స్ అనుపమనుద్దేశించి అన్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ధృవ్ మాటలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి.