Reading Time: < 1 minute
AP Assembly Live: మెగా డీఎస్సీ, రిజర్వేషన్లపై చర్చ.. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రత్యక్ష ప్రసారం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ సమావేశాళ్లో మెగా డీఎస్సీ, స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది. ఈ సమావేశాల్లో నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్‌లనను తప్పనిసరి చేశారు.

మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్‌ సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టి భవిష్యత్‌లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకు రానుంది. దీనిపై డెడికేటెడ్‌ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.