
మనది అయితే ఎలాగైనా.. ఏ రూపంలో అయినా వస్తుంది.. మనది కానప్పుడు అది దక్కదు.. ఏమైనా రాసి పెట్టి ఉంటే.. ఎక్కడ ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా వస్తుంది అనటానికి ఇదే నిదర్శనం. అవును.. పొట్టకూటి కోసం.. దేశం కాని దేశం దుబాయ్ వెళ్లాడు ఆ వ్యక్తి.. 17 ఏళ్లుగా దుబాయ్ లోనే ఉంటూ వాచ్ మెన్ ఉద్యోగం చేస్తున్నాడు.. నాలుగేళ్లుగా స్నేహితులతో కలిసి బిగ్ టికెట్ అనే లాటరీ కొంటూ వస్తున్నాడు.. ఎట్టకేలకు అతను కొన్న లాటరీకి ప్రైజ్ మనీ వచ్చింది. ఏకంగా 26 లక్షల రూపాయలు రాత్రికి రాత్రి వచ్చాయి.. ఇది చూసిన తర్వాత అదృష్టం అంటే ఇలాగే ఉంటుంది.. రాసి పెట్టి ఎక్కడ ఉన్నా వచ్చి తీరుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. పూర్తి వివరాల్లోకి వెళితే..
44 ఏళ్ల సైదలవి. కేరళ రాష్ట్రం. 17 ఏళ్ల క్రితం.. దుబాయ్ దేశంలోని ఓ స్కూల్ లో వాచ్ మెన్ ఉద్యోగం వచ్చిందని.. కుటుంబాన్ని వదిలి వెళ్లాడు. అప్పటి నుంచి అక్కడే పని చేస్తూ ఉన్నాడు. నాలుగేళ్లుగా లాటరీ టికెట్లు కొనటం మొదలుపెట్టాడు. ప్రతి నెలా వచ్చే బిగ్ లాటరీ.. మన కరెన్సీలో దీని విలువ 26 లక్షల రూపాయలు. ప్రతినెలా తీస్తారు ఈ లాటరీ. నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా స్నేహితులతో కలిసి కొంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు.. 2026, జూలై నెలకు సంబంధించిన లాటరీ విజేతను.. ఆగస్టు నెలలో ప్రకటించారు. మొత్తం ఐదుగురిని విజేతలుగా ప్రకటిస్తారు. ఈ ఐదుగురిలో ఒకరు ఈ వాచ్ మెన్ సైదలవి. లక్ష దినార్హులు. అంటే 26 లక్షల రూపాయలు.
లాటరీలో 26 లక్షలు గెలుచుకోవటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు వాచ్ మెన్ సైదలవి. ఈ డబ్బును కేరళలోని కుటుంబానికి పంపించనున్నట్లు తెలిపాడు. అదే విధంగా వచ్చే నెలకు సంబంధించి లాటరీ కొనుగోలు చేశానని చెబుతున్నాడు. నాలుగేళ్లుగా ఎంతో ఆశతో.. క్రమం తప్పకుండా కొనుగోలు చేస్తున్నానని.. ఇప్పటికి అదృష్టం వరించిందని.. కష్టాలు కొంచెం తీరాయని.. తన కుటుంబానికి ఇది ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు సైదలివి.
అదృష్టం అంటే ఇదే అని.. రాసి పెట్టి ఉంటే ఎక్కడున్నా.. ఏ రూపంలో అయినా మనకు వచ్చి తీరుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.