
శని భగవానుడు.. శని గ్రహం.. అంటే జనాలు భయపడతారు. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడు కర్మఫలదాతగా.. న్యాయాధిపతిగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే గ్రహాల అన్నింటిలోకి శని దేవుని కదలికకు జ్యోతిష్య నిపుణులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఆగస్టు 20 వ తేది గురువారం రాత్రి 10.36 గంటలకు శని గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశించాడు. అక్కడే అక్టోబర్ 9 వరకు సంచరిస్తాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆరు రాశుల వారికి ( వృషభం, సింహం, మిథునం, తుల, ధనస్సు, మకరం, మీనం ) కెరీర్, ఆర్థిక పరమైన రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం.
వృషభరాశి: శని భగవానుడు రేవతినక్షత్రంలో సంచరించే సమయం ఈ రాశి వారికి అనుకోని విజయాలు కలుగుతాయి. పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
సింహరాశి: ఈ రాశి వారికి అన్ని విధాలుగా మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మిథునరాశి: శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచరించే సమయం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులకు ఎంతో కాలంగా అమ్ముడుపోని వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు తీసుకున్న నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తులారాశి: శని భగవానుడు రేవతి నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి అన్నీ రకాల ప్రతికూల పరిస్థితుల నుంచి భారీ ఊరట కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కొంతకాలంగా ఆగిపోయిన పనుల్లో కదలిక ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది. టెక్నికల్ రంగంలో ఉన్న వారు కొత్త ప్రాజెక్ట్ లు చేపడతారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థి తి బలపడుతుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనస్సురాశి: శని రేవతి నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి జాతకులకు ఎంతో మేలు కలుగుతుంది. చేతి వృత్తుల వారికి ఊహించని పురోగతి ఉండే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలతో పాటు.. ప్రమోషన్ రావడం.. వేతనం పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. కోర్టు వ్యవహారాల విషయంలో అనుకూలంగా సమస్యలు పరిష్కారమవుతాయి. .వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త ఒప్పందాలు కుదురుతాయి.కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందే అవకాశాలున్నాయి.
మకరరాశి: రేవతి నక్షత్రంలో శని సంచారం వలర ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతోంది. అదృష్టం విపరీతంగా పెరగడమే కాకుండా అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సాధించబోతున్నారు. ఉద్యోగస్తులకు పలుకుబడి కూడా విపరీతంగా లభించబోతోంది. అనుకున్న పనుల్లో ఊహించని శుభవార్తలు వింటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. జీవితంలో ప్రేమ వ్యవహారాలు కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన పెండింగ్ పనులన్నిటినీ పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు
మీనరాశి: శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం వలన ఈ రాశి వారికి అదృష్టాన్ని పెంచుతుంది. ఈ కాలంలో వీరికి ధనప్రయోజనాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆస్తివ్యవహారాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో పుణ్యక్షేత్రాలకు వెళ్లవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ అవకాశాలు ఎక్కువగా అంది వస్తాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది.వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్ల వలసి వస్తుంది. ఉద్యోగంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్య కలాపాలతో పాటురాబడి కూడా బాగా పెరుగుతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.