
Redmi Note 17 Pro Max 5G: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో “రెడ్‌మీ నోట్” సిరీస్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో మరో పవర్‌ఫుల్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు షావోమీ (Xiaomi) సిద్ధమైంది. రెడ్‌మీ నోట్ 17 ప్రో మాక్స్ 5G (REDMI Note 17 Pro Max 5G) గ్లోబల్ లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ‘Titan power, go max’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ ఫోన్‌ను ఆగస్టు 27న ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయనున్నారు. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 17 ప్రో ను చైనాలో విడుదల చేసిన కాగా.. ఇప్పుడు అదే సిరీస్‌లో టాప్ ఎండ్ మోడల్‌గా నోట్ 17 ప్రో మాక్స్ 5Gను తీసుకొస్తోంది.
10,000mAh భారీ బ్యాటరీ:
ఈ రాబోయే కోట స్మార్ట్ ఫోన్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 10,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ. రెడ్‌మీ నోట్ సిరీస్‌లో ఇప్పటివరకు అందించిన అతిపెద్ద బ్యాటరీ ఇదే అని కంపెనీ చెబుతోంది. బ్యాటరీ కెపాసిటీ పెద్దదిగా ఉన్నప్పటికీ ఛార్జింగ్ విషయంలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 100W హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.
‘టైటన్ క్వాలిటీ’ డ్యూరబిలిటీ:
ఫోన్ బలమైన నిర్మాణంతో వస్తోంది. TÜV SÜD సహకారంతో అభివృద్ధి చేసి, SGS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను పొందింది. గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తు నుంచి హార్డ్ సర్ఫేస్‌పై పడినా తట్టుకునే సామర్థ్యం ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP66, IP68, IP69, IP69K వంటి పలు రేటింగ్‌లను అందించారు. దీంతో నీటిలో మునిగిపోవడం, అధిక పీడనంతో నీటి జెట్‌లు, ఆవిరి వంటి పరిస్థితుల నుంచి ఫోన్‌కు రక్షణ లభిస్తుంది.
AMOLED డిస్‌ప్లే:
డిస్‌ప్లే విషయానికి వస్తే ఇందులో 6.83 అంగుళాల CrystalRes AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ కు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రా-థిన్ బెజెల్స్‌తో స్క్రీన్‌కు ప్రీమియం లుక్ అందించారు. వెనుక భాగంలో ప్రత్యేకమైన “క్లౌడ్ బ్లుష్” ఫోటోక్రోమిక్ ఫినిష్ ను అందించారు. సూర్యరశ్మి లేదా UV కిరణాలు తగిలినప్పుడు ఈ బ్యాక్ ప్యానెల్ రంగు మారేలా రూపొందించారు. సాఫ్ట్ టచ్ ఫినిష్ కారణంగా ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

ప్రాసెసర్:
పనితీరు కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 6 Gen 5 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 12GB ఫిజికల్ ర్యామ్ ఉంటుంది. అదనంగా 12GB వర్చువల్ ర్యామ్ ఎక్స్‌పాన్షన్ ద్వారా మొత్తం 24GB వరకు ర్యామ్ ను పొందే అవకాశం ఉంటుంది. సాఫ్ట్‌వేర్ పరంగా కూడా ఫోన్ దీర్ఘకాలికంగా స్మూత్‌గా పనిచేసేలా రూపొందించారు. ఏకంగా 72 నెలల ‘లైక్-న్యూ’ సాఫ్ట్‌వేర్ అనుభవం కోసం సర్టిఫికేషన్ పొందినట్లు కంపెనీ తెలిపింది.
50MP కెమెరా:
కెమెరా విభాగంలో 50MP ప్రైమరీ సెన్సార్ ను అందించారు. ఇది f/1.5 అపెర్చర్, 26mm ఈక్వివలెంట్ ఫోకల్ లెంగ్త్‌తో వస్తుంది. తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు తీసేందుకు పెద్ద అపెర్చర్ ఉపయోగపడుతుంది. పోర్ట్రెయిట్ ఫొటోగ్రఫీ కోసం ప్రత్యేకమైన AI పోర్ట్రైట్ అల్గోరిథమ్స్ ను ఇందులో అందించారు. ఇవి సబ్జెక్ట్ ఎడ్జ్‌లను గుర్తించడం, టెక్స్చర్‌ను మెరుగుపరచడం, తక్కువ వెలుతురులో స్కిన్ టోన్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి.
ధర:
REDMI Note 17 Pro Max 5Gకి సంబంధించిన ధర, RAM/స్టోరేజ్ వేరియంట్లు, వివిధ మార్కెట్లలో లభ్యత వివరాలను ఆగస్టు 27న జరిగే అధికారిక గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనున్నారు.