Reading Time: 2 minutes

Jasmin Bhasin: కంటెస్టెంట్లను వణికిస్తున్న డేంజరస్ స్టంట్స్.. ఏకంగా జ్ఞాపకశక్తి కోల్పోయిన హీరోయిన్!

Caption of Image.

ఇండియాలో మోస్ట్ పాపులర్ స్టంట్ ఆధారిత రియాలిటీ షో ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ (Khatron Ke Khiladi). ప్రస్తుతం ఈ స్టంట్ షో 15వ సీజన్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ షోకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. కలర్స్ టీవీ ఛానెల్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ షో ఇపుడు కంటెస్టెంట్లలో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

స్టంట్స్ మాయాజాలం- జ్ఞాపకశక్తిని మరిచిపోయిన కంటెస్టెంట్!

ప్రముఖ నటి జాస్మిన్ భాసిన్ ఇటీవల ‘ఖత్రోన్ కే ఖిలాడీ 15’ షోలో పాల్గొన్నారు. ఈ షోలో భాగంగా ఓ ప్రమాదకరమైన వాటర్ స్టంట్ చేస్తుండగా ఆమెకు తలకు గాయం అయింది. వైద్యులు పరీక్షించిన అనంతరం జాస్మిన్‌కు స్వల్ప కంకషన్ (Mild Concussion) ఉన్నట్లు నిర్ధారించారు.

ఈ ఘటన తర్వాత కొద్దిసేపు తనకు జ్ఞాపకశక్తి మందగించినట్లు జాస్మిన్ వెల్లడించారు. స్టంట్ పూర్తయిన వెంటనే ఏం జరిగిందో తనకు గుర్తు లేదని, ఆ ఘటనలోని కొంత భాగం ఇప్పటికీ తన జ్ఞాపకాల్లో లేదని తెలిపారు. అనంతరం వైద్యులు 72 గంటల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు జాస్మిన్ పేర్కొన్నారు.

ధైర్యశాలిగా నిలిచిన జాస్మిన్..

ఈ తాత్కాలిక జ్ఞాపకశక్తి సమస్య కొద్దిసేపు ఆందోళన కలిగించినప్పటికీ, ఆమె తన అంకితభావంతో స్టంట్‌ను విజయవంతంగా పూర్తి చేసి అందరి ప్రశంసలను అందుకున్నారు. “ఇది నాకు పూర్తిగా ఊహించని అనుభవం. స్టంట్ తర్వాత వెంటనే ఏం జరిగిందో నాకు గుర్తు లేదు. ఇప్పటికీ ఆ అనుభవంలోని కొంత భాగం నా జ్ఞాపకాల్లో లేదు” అని జాస్మిన్ స్టంట్ అనంతరం తెలిపింది. ఈ ఘటన తనకు మానసికంగా కూడా సవాలుగా అనిపించిందని, అయితే, ఈ అనుభవం తన గురించి చాలా విషయాలు నేర్పిందని పేర్కొంది. చివరగా “నేను భయపడి ఉండొచ్చు. కానీ చివరికి నా పోరాట స్ఫూర్తిని తిరిగి పొందాను” అని జాస్మిన్ చెప్పింది. జాస్మిన్ భాసిన్ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ ఫ్రాంచైజీలో పాల్గొనడం ఇది మూడోసారి. ఈ షో Colors TVలో ప్రసారం అవుతుండగా, ఆన్‌లైన్‌లో JioHotstarలోనూ అందుబాటులో ఉంది.

►ALSO READ | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం: 36 ఏళ్లకే నటి అనుమానాస్పద మృతి.. బర్త్ డేకు 4 రోజుల ముందే

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

కంటెస్టెంట్లను వెంటాడుతున్న ప్రమాదాలు.. 

ఈ సీజన్‌లో ఇప్పటికే కంటెస్టెంట్లకు పలు ప్రమాదకరమైన స్టంట్లు ఎదురవుతున్నాయి. మొదటి వారంలో పెల్లెట్ గన్ స్టంట్‌లో భాగంగా కంటెస్టెంట్లు పెల్లెట్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా మరో టాస్క్‌లో భాగంగా వారి చేతులపై వేడి మైనాన్ని పోశారు. అంతేకాదు… ఇప్పటికే బాలీవుడ్ నటుడు గౌరవ్ ఖన్నా తనకు తగిలిన గాయాల వీడియోను పంచుకున్నారు. ఇటీవలే నటుడు కరణ్ వాహి కూడా తనకు రబ్బర్ బుల్లెట్ ద్వారా గాయపడినట్లు, ఆ స్టంట్ కారణంగా వీపు భాగంలో తగిలిన గాయాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్  చేయగా వైరల్ అయ్యాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

©️ VIL Media Pvt Ltd.