Reading Time: < 1 minute

రవితేజ ‘ఇరుముడి’ మూడు లేయర్స్‌తో రాబోతోంది: డైరెక్టర్ శివ నిర్వాణ

Caption of Image.

నిన్నుకోరి, మజిలీ, ఖుషి వంటి చిత్రాలతో దర్శకుడిగా మెప్పించిన శివ నిర్వాణ..  రవితేజతో ‘ఇరుముడి’ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ  నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ చెప్పిన విశేషాలు.  

‘‘ఈ టైటిల్ ప్రకటించినప్పట్నుంచీ అందరిలోనూ ఆసక్తిని పెంచింది.  ఇందులో  మూడు లేయర్స్ ఉంటాయి. ఒకటి అయ్యప్ప స్వామి మాల నేపథ్యం, రెండోది ఫ్యామిలీ, మరొకటి క్రైమ్ యాంగిల్. ఇప్పటివరకు చూడని బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో  ఈ చిత్రం  ఉంటుంది.  ఇందులో  అయ్యప్ప మాల నేపథ్యాన్ని సహజంగా చూపించేందుకు నేను కూడా మాల ధరించి ఆ విషయాలను తెలుసుకున్నా. రవితేజ గారు ఈ పాత్రకు పర్ఫెక్ట్‌‌‌‌గా సరిపోయారు.  ఆయన గడ్డం, తేజస్సు పాత్రకు బాగా కుదిరాయి. రవితేజ కూతురిగా  బేబీ నక్షత్ర పోషించిన మనెమ్మ పాత్ర చాలా కీలకం.  గురుస్వామిగా సాయికుమార్  అద్భుతంగా నటించారు.  సీలేరు  ప్రాంతంలో చిత్రీకరించిన విజువల్స్,  అక్కడి ప్రకృతి ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్తాయి. ఇక ‘మల్లెపూల పల్లకి’ పాటకు హ్యూజ్ రెస్పాన్స్‌‌‌‌ రావడం హ్యాపీ. ఒరిజినల్‌‌‌‌గా పాట పాడిన డప్పు శ్రీనుతోనే మళ్లీ పాడించాం. ప్రతి కథ గుర్తుండిపోయేలా చెప్పాలనేదే నా ఉద్దేశం. ఇందులోనూ చక్కని హ్యూమన్ డ్రామా ఉంది. మాల వేసుకున్నప్పుడు హీరో ఎలా ఉంటాడు, మాల లేనప్పుడు ఎలా ఉంటాడు అనేది చాలా ఇంటెన్స్‌‌‌‌గా చూపించాం. థియేటర్స్‌‌‌‌లో ప్రేక్షకులు ఆ ఎమోషన్‌‌‌‌ను ఆస్వాదిస్తారు” అని అన్నాడు.

©️ VIL Media Pvt Ltd.