Reading Time: < 1 minute

ఊహకందని ట్విస్టులు.. థియేటర్లలోకి సస్పెన్స్ బ్లాస్ట్ ‘ది రెడ్ బ్యాగ్’

Caption of Image.

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలపై ఆసక్తి పెరుగుతున్న వేళ.. ఓ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో టెన్షన్ పుట్టించేందుకు సిద్ధమవుతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ భారీ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్న ‘ది రెడ్ బ్యాగ్’ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలకు వచ్చిన స్పందన సినిమాపై అంచనాలను పెంచేసింది.

ఈ సినిమా గురించి నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ప్రేక్షకులు చూసింది కేవలం శాంపిల్ మాత్రమేనని, అసలు థ్రిల్ థియేటర్లలోనే ఉంటుందని చెబుతున్నారు. గ్లింప్స్ నుంచి పాటల వరకు ప్రతి కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు., ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌ల స్టైలిష్ టేకింగ్‌కు ప్రశంసలు దక్కాయని తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ కంటే సినిమా పది రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుందని, చివరి క్షణం వరకు ఊహించని మలుపులతో కథనం సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సస్పెన్స్, యాక్షన్, థ్రిల్‌ను పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌గా మలిచిన ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. యంగ్ కంపోజర్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సినిమాకు అదనపు బలంగా నిలవనున్నాయి.

కంటెంట్ నచ్చడంతో పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీగా రిలీజ్ చేస్తోంది. మరి నిర్మాత చెబుతున్నట్టుగా ‘ది రెడ్ బ్యాగ్’ నిజంగానే ప్రేక్షకుల అంచనాలను తలకిందులు చేస్తుందా? ఆగస్టు 21న థియేటర్లలో చూడాలి.

 

©️ VIL Media Pvt Ltd.