Reading Time: < 1 minute

జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు కీలక పదవి..క్యాబినెట్హోదా.. AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్

Caption of Image.

ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం జనసేన  ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకుఅత్యంత కీలకమైన పదవిని కేటాయించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ  అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు నాగబాబుకు ప్రత్యేకం గా రాష్ట్ర క్యాబినెట్ హోదాను కూడా ప్రభుత్వం కల్పించింది. గతంలో ఏపీ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే వార్తలు గట్టిగా వినిపించిన నేపథ్యంలో, ప్రస్తుతం క్యాబినెట్ హోదాతో కూడిన ఈ కీలక నియామకం జరగడం రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.

©️ VIL Media Pvt Ltd.