
సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, బ్రిటన్ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. ఆగస్టు 20 నుంచి 30 వరకు అమెరికా, యూకేలో పర్యటించనున్నారు సీఎం రేవంత్. ఈ క్రమంలో మంగళవారం ( ఆగస్టు 18 ) రాత్రి ఢిల్లీకి బయలుదేరారు సీఎం రేవంత్. ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఢిల్లీ నుంచి లండన్ కు బయలుదేరనున్నారు.
ఈ క్రమంలో అమెరికా యూకేలో ఉన్న పలు యూనివర్సిటీలను సందర్శించనున్నారు. అక్కడి వర్సిటీల బృందాలతో సమావేశం కానున్నారు. లండన్ పర్యటన అనంతరం అమెరికా పర్యటనకు వెళ్లారు సీఎం రేవంత్.
సీఎం లండన్ షెడ్యూల్:
- ఆగస్టు 21న లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌ను సందర్శించనున్నారు సీఎం రేవంత్. ఎమిరేట్స్ స్టేడియంలో ఫుట్‌బాల్ ప్రజెంటేషన్‌లో పాల్గొననున్నారు సీఎం.
- 22న లండన్‌లోని కేంబ్రిడ్జ్ బృందంతో సమావేశం కానున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ క్యాంపస్‌లోని సెనేట్ హౌస్‌ను సందర్శించనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లండన్ బిజినెస్ స్కూల్‌కు వెళ్తారు.
- ఆగస్టు 23న లండన్ నుంచి అమెరికాలోని బోస్టన్‌కు బయలుదేరనున్నారు సీఎం రేవంత్.
అమెరికా షెడ్యూల్:
- ఆగస్టు 24న ఉదయం 10.30 గంటలకు బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎంఐటీ క్యాంపస్‌కు వెళ్లానున్నారు.
- ఆగస్టు 25న ఉదయం 10.30 గంటలకు బోస్టన్‌లో నార్త్ ఈస్టర్న్ క్యాంపస్‌ను సందర్శించనున్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు వర్జీనియా టెక్ యూనివర్సిటీ బృందంతో సమావేశం అనంతరం… రాత్రి 7 గంటలకు బోస్టన్ నుంచి న్యూయార్క్ సిటీకి సీఎం పయనమవుతారు.
- ఆగస్టు 26న న్యూయార్క్‌లో రాత్రి 7 గంటలకు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్.
- ఆగస్టు 29న న్యూయార్క్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు.
- ఆగస్టు 30న హైదరాబాద్‌కు చేరుకుంటారు.