Reading Time: < 1 minute

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు… ఐదుగురు కింగ్ పిన్స్ అరెస్ట్..

Caption of Image.

హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయ్యింది. ఆపరేషన్ భోళా చేపట్టిన ఈగల్ ఫోర్స్ మంగళవారం ( ఆగస్టు 18 ) భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. 1908 టోల్ ఫ్రీ నంబర్ కు వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఒడిశా అడవుల నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్న డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్స్ గా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు అధికారులు.

ఈ తనిఖీల్లో 100 మంది డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్నట్లు తెలిపారు అధికారులు.వీరిలో 80 మందికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని.. 38 మందిని డీ-అడిక్షన్‌ సెంటర్ కు తరలించామని తెలిపారు. పట్టుబడిన వారిలో 7 మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు తెలిపారు అధికారులు. మరో 42 మందిని డీ-అడిక్షన్‌ సెంటర్ కు పంపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈగల్ ఫోర్స్ అధికారులు.

►ALSO READ | రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ప్రభావతి

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ రాకెట్ కు సూత్రధారులెవరు.. డ్రగ్స్ రాకెట్ ఎక్కడిదాకా వ్యాపించింది వంటి వివరాలు అరా తీస్తున్నారు అధికారులు.

©️ VIL Media Pvt Ltd.