జబర్దస్త్ ఫేమ్, ప్రముఖ బుల్లితెర కమెడియన్ ఫైమా ఈ ఏడాది జూన్ లో పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్ ను ఆమె పెళ్లి చేసుకుంది. మొదట రిజిస్టర్ ఆఫీస్ లో సింపుల్ గా పూల దండలు మార్చుకున్న ఈ లవ్ బర్డ్స్ ఆ తర్వాత ఇరు పెద్దల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.
ప్రస్తుతం అత్తారింట్లో ఉంటోన్నఫైమా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ఆమె తన భర్త ఫ్యామిలీతో కలిసి సరదాగా హైదరాబాద్ లో ఉన్న జంతు ప్రదర్శనశాల కి వెళ్లింది.
ఈ సందర్భంగా జూలో తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది ఫైమా. వీటికి ‘ ఫ్యామిలీ టైమ్’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి
ఇదిలా ఉంటే పెళ్లి పనులు పూర్తవ్వగానే మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్ పై దృష్టి సారించింది ఫైమా. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ తో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తోందీ లేడీ కమెడియన్. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అత్తారిటింకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పంచుకుంటోంది.
కాగా జబర్దస్త్ ఫైమా- ప్రవీణ్ ల పెళ్లి వేడుకకు ఇరుక కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు జబర్దస్త్ ఆర్టిస్టులు, బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట బాగా వైరలయ్యాయి.
ఇక వీరి వివాహం నెల రోజులు పూర్తవ్వడంతో ఇటీవలే వన్ మంత్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఫైమా- ప్రవీణ్. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకున్నారీ లవ్లీ కపుల్. అలాగే ప్రేమలో ఉన్నప్పటి క్షణాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.





