
ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. రూ.868 కోట్లతో పంచాయతీ రాజ్ పనులకు శ్రీకారం చుట్టారు. ములుగులో పైలాన్ అవిష్కరణ, కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించారు. కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారుసీఎం. అంతకుముందు మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు సీఎం. వనదేవతలకు చీరె, సారె, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 868 కోట్ల పంచాయతీ రాజ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు సీఎం ప్రారంభించారు. కొత్త గా నిర్మించిన ములుగు జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం, పైలాన్ ను సీఎం ప్రారంభించారు. అనంతరం వితంతువులు, ఒంటరి మహిళలకు ఫించన్లు అందజేశారు. మేడారం గద్దెల పరిధిలోని నిర్మించిన వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు సీఎం.
సీఎం వెంట పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మన్, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.