
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన స్కాం.. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూలేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ స్కాంకు సంబంధించి అన్ని వాస్తవాలు, నిజాలను అసెంబ్లీలో పెట్టనున్నట్లు వెల్లడించారు సీఎం చంద్రబాబు. 2026, ఆగస్ట్ 17వ తేదీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సీఎం చంద్రబాబు.. మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ గొడ్డలి పార్టీ స్వార్థానికి ఎందరో నిరుద్యోగులు బలయ్యారని.. 50 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి గ్రూప్ 1 స్కాం ఎప్పుడూ చూడలేదన్నారు సీఎం చంద్రబాబు. జగన్ స్వార్థానికి లక్షల మంది నిరుద్యోగులు బలయ్యారని చెప్పుకొచ్చారాయన.
డీఎస్సీ అభ్యర్థులు ఆత్మగౌరవంతో.. ఆత్మాభిమానంతోనే రోడ్డెక్కారని.. డీఎస్సీ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని.. వాళ్ల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తుంటే వాళ్లు చూస్తూ ఎలా ఉంటారని ప్రశ్నించిన సీఎం చంద్రబాబు.. టీచర్ ఉద్యోగానికి ఎంపిక అయిన వాళ్లు ఆత్మగౌరవంతోనే రోడ్డెక్కారాన్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే.. జగన్ హయాంలో జరిగిన గ్రూప్ వన్ నియామకాల్లో అక్రమాలు బయటపెట్టనున్నట్లు వెల్లడించారాయన.