Reading Time: < 1 minute

పబ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌లో ఇందిరమ్మ అనర్హుల లిస్ట్..అప్లికేషన్ రిజెక్ట్ అయితే కారణాలు కూడా వెల్లడి 

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఎల్‌‌‌‌‌‌‌‌ఐజీ టవర్స్‌‌‌‌‌‌‌‌కు దరఖాస్తు చేసిన అర్హులు, అనర్హుల లిస్ట్‌‌‌‌‌‌‌‌ను పబ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌లో పెట్టేందుకు హౌసింగ్ బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు. అప్లికేషన్ రిజెక్ట్ అయితే అందుకు కారణాలను కూడా వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో వెల్లడించనున్నారు. లిస్ట్‌‌‌‌‌‌‌‌పై అభ్యంతరాలు ఉంటే ప్రజలు చెప్పేందుకు గడువు ఇవ్వనున్నారు. క్యూర్ పరిధిలో ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఎల్‌‌‌‌‌‌‌‌ఐజీ టవర్స్‌‌‌‌‌‌‌‌కు ఇప్పటికే అప్లికేషన్లు తీసుకున్నారు.

16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్ల కోసం సుమారు 61,500 అప్లికేషన్లు వచ్చాయి. ప్రస్తుతం సీజీజీ ఆధ్వర్యంలో 360 డిగ్రీ విధానంలో ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేశారా? ఫ్లాట్‌‌‌‌‌‌‌‌కు అర్హులా? అనర్హులైతే ఎందుకు? అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయింది? అనే వివరాలను అధికారులు వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో స్పష్టంగా పెట్టనున్నారు. ఈ నెల 20 తర్వాత డ్రా తీసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.