Reading Time: < 1 minute

4 నెలలు.. 10 కేసులు.. 22 మందికి ఉరిశిక్ష..యూపీ జడ్జి సంచలన తీర్పులు

Caption of Image.

ముజఫర్‌‌‌‌నగర్: ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని ముజఫర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవి కుమార్ దివాకర్ గత నాలుగు నెలల్లో 10 కేసుల్లో 22 మందికి మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారు. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి కాంప్లెక్స్‌‌‌‌లో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి.. అప్పట్లో ఆయన వార్తల్లో నిలిచారు. లక్నోకు చెందిన 46 ఏండ్ల రవి కుమార్ దివాకర్.. బీకామ్, ఎల్ఎల్ఎం పూర్తిచేసి 2009లో అజంగఢ్‌‌‌‌లో అదనపు సివిల్ జడ్జిగా తన వృత్తిని ప్రారంభించారు. 2015 మే నెలలో సుల్తాన్‌‌‌‌పూర్‌‌‌‌లో సివిల్ జడ్జిగా, 5 నెలల తర్వాత జ్యుడిషియల్జిస్ట్రేట్‌‌‌‌గా పదోన్నతి పొందారు.

నవంబర్ 2025 నుంచి ముజఫర్‌‌‌‌నగర్‌‌‌‌లో అదనపు జిల్లా అండ్​ సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్​6 నుంచి ఈ నెల 13 వరకు 22 మందికి మరణశిక్ష విధిస్తూ తీర్పులు చెప్పారు. 12 ఏండ్ల నాటి పవన్ కుమార్ హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురికి ఈ నెల 13న మరణశిక్ష, రూ. 1.70 లక్షల జరిమానా విధించారు. 2014లో షామ్లీ జిల్లాలో పాత కక్షల కారణంగా నిందితులు పవన్ కుమార్ ఇంట్లోకి వెళ్లి కాల్పులు జరిపి హత్య చేశారు. దాదాపు 27 ఏండ్ల నాటి కలప వ్యాపారి కిడ్నాప్, హత్య కేసులో దోషికి ఈ నెల 12న ఉరిశిక్ష విధించారు. 2011లో షామ్లీ జిల్లాలో దోపిడీకి యత్నించి.. ఒక రైతును హత్య చేసిన కేసులో నలుగురు దోషులకు జులై 17న  మరణశిక్ష విధించారు. 

©️ VIL Media Pvt Ltd.