
న్యూఢిల్లీ: హెచ్ఆర్ టెక్ సేవలు అందించే హైదరాబాద్ సంస్థ డార్విన్ బాక్స్‌ను దక్కించుకోవడానికి గ్లోబల్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కొన్నేళ్లలో ఐపీఓకు రానున్న ఈ స్టార్టప్ కంపెనీని కొనడానికి సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్, ఏడీపీ ఆసక్తి చూపిస్తున్నాయి.
గత మార్చిలో కేకేఆర్, పార్టనర్స్ గ్రూప్ నుంచి 140 మిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం డార్విన్ బాక్స్ విలువ రెండు బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే, సంస్థ వాటాల అమ్మకం ఆలోచన లేదని డార్విన్ బాక్స్ ప్రతినిధి స్పష్టం చేశారు.
ఐపీఓ కోసం ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సేల్స్‌ఫోర్స్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ ఉత్పత్తులలో పేరోల్ సేవలను చేర్చాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న ఏడీపీ తమ నైపుణ్యాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది. అందుకే డార్విన్ బాక్స్పై ఆసక్తి చూపుతోంది.