Reading Time: < 1 minute

నేతన్నలకు పెన్షన్ అందేలా చొరవ చూపాలి : టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్

Caption of Image.
  • మంత్రి సీతక్కకు టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పేద చేనేత కార్మికుల సంక్షేమం కోసం అర్హులైన ప్రతి నేతన్నకు చేయూత పథకం కింద పెన్షన్ అందేలా చొరవ చూపాలని టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకట రమణ కోరారు. మంగళవారం సచివాలయంలో పద్మశాలి కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌తో కలిసి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

తరతరాలుగా చేనేత వృత్తినే నమ్ముకుని బతుకుతున్న వృద్ధ నేతన్నలకు పెన్షన్ ఎంతో భరోసా ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం చేయూత కింద పెన్షన్ పొందుతున్న అర్హుల పెన్షన్‌‌‌‌‌‌‌‌ను కొత్త పథకం పేరుతో ఆపకుండా కొనసాగించాలని కోరారు. చేనేత సహకార సంఘాల్లో సభ్యత్వం ఉండి 50 ఏంండ్లు నిండిన పేద నేతన్నలకు కూడా పెన్షన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

 

©️ VIL Media Pvt Ltd.