
ప్రస్తుతం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రకం సినిమాలను చూసేవారు చాలా మంది ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి వారం ఓటీటీలో కనీసం రెండు, మూడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా సిరీస్ లు స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. ఇతర భాషల్లోహిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు కూడా ఆయా భాషల డబ్బింగ్ వెర్షన్ తో ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అలా ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు ఒక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తోంది. థియేటర్లలో ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను కూడా మెప్పించేందుకు వస్తోంది. ఆ సినిమా మరేదో కాదు అక్కినేని సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ న్యూటన్స్ థర్డ్ లా.