
ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన అనిరుద్ధాచార్య అమెరికాలోని చికాగో ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకుంటున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశార. ప్రజలందరూ క్రమం తప్పకుండా బ్లడ్ టెస్ట్స్ చేయించుకోవాలని కూడా సలహా ఇచ్చారు బాబా. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు దారితీసింది.
సాధారణ ప్రజలకు మాత్రం అనారోగ్యం వస్తే గోమూత్రం తాగమని, ఆవు పేడతో నయం చేసుకోవాలని చెప్పే బాబా.. తనకు రోగం వచ్చేసరికి అమెరికా ఆసుపత్రికి ఎందుకు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. సామాన్యులకు మూఢనమ్మకాలు ఫాలో అవ్వమని చెప్పి మోసం చేస్తారు, తమకువస్తే మాత్రం విదేశీ వైద్యం కావాల్సి వచ్చిందా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
Pookie Baba, Aniruddhacharya to Indians :
Drink and bath in Cow urine to cure Cancer, blood pressure, TB
Apply Gobbar to cure skin diseasesBut he himself will go all the way to Chicago, USA 🇺🇲 for treatment. Fraudster won’t even trust Indian Hospitals, forget cow urine. pic.twitter.com/4TMkCZEPzc
— D (@Deb_livnletliv) August 18, 2026
కొద్ది రోజుల క్రితం మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ నుంచి కోలుకోవడానికి గోమూత్రం వాడానని చెబితే బాబా దానిని విపరీతంగా ప్రచారం చేశారు. కానీ వైద్యులు మాత్రం క్యాన్సర్‌కు గోమూత్రంతో ఎలాంటి సంబంధం లేదని.. ఆపరేషన్లు, కీమోథెరపీ వల్లే ఆమె ప్రాణాలు నిలిచాయని క్లారిటీ ఇచ్చారు. చివరికి ఆ మహిళ కూడా ఆధునిక వైద్యమే తనను కాపాడిందని చెప్పారు. ప్రసంగాల్లో బాబా చెప్పే మాటలకు.. వాస్తవ చేతలకు పొంతన కుదరడం లేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున రోస్టింగ్ నడుస్తోంది.
ALSO READ : NEET పేపర్ లీక్ నిరసనలు
బాబా అనిరుద్ధాచార్య అమెరికాలోని చికాగో ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవటమే కాకుండా ప్రజలు కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇలా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో గతంలో ప్రజలకు సంప్రదాయ వైద్యం, గోమూత్రం వంటి నివారణలు చెప్పిన బాబా.. తనకు అనారోగ్యం వస్తే మాత్రం విదేశీ ఆసుపత్రులకు పరుగులు తీయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.