
చార్మినార్, వెలుగు: బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రభావతి ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మంగళవారం చాంద్రాయణగుట్ట నర్కి పూల్‌బాగ్‌లోని జోనల్ కార్యాలయంలో రూ.20 వేల లంచం తీసుకుంటుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సంతోష్‌నగర్ సర్కిల్–25 పరిధిలో బిల్డింగ్ పర్మిషన్ ఫైల్ ప్రాసెస్ చేసి, బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, వర్క్ కమాన్స్మెంట్ లెటర్ ఇచ్చేందుకు ప్రభావతి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు చెప్పారు. నిందితురాలిని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.