
హైదరాబాద్ సిటీలో క్రిప్టో కరెన్సీ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. ఈ సైబర్ క్రైం చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా బాధితుల నుంచి రూ.7 లక్షలు బెదిరించి గుంజినట్లు పోలీసులు తేల్చారు. సోషల్ మీడియాలో క్రిప్టో ట్రేడింగ్ పేరుతో బాధితులకు ఎర వేసి.. లావాదేవీల పేరుతో పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాగా పోలీసులు గుర్తించారు.
కింగ్స్ స్నూకర్ దగ్గర ఈ నలుగురిని హైదరాబాద్ బండ్లగూడ పోలీసులు పట్టుకున్నారు. మరో నిందితుడు A-5 పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు. ముఠాకు మరో 4 కేసులతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.
డిజిటల్ యుగంలో మనిషి జీవితాన్ని సులభతరం చేసిన సాంకేతిక పరిజ్ఞానం, అదే సమయంలో కొత్త రకాల నేరాలకు కూడా మార్గం సుగమం చేసింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ పేరుతో జరుగుతున్న మోసాలు సామాన్య ప్రజల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తూ, వారి కష్టార్జిత సంపాదనను క్షణాల్లో ఆవిరి చేస్తున్నాయి.
►ALSO READ | దృష్టి మళ్లించి దోపిడీలు చేస్తున్న..అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్ అరెస్ట్
గతంలో మోసాలు అంటే నకిలీ పత్రాలు, చెక్కులు, చిట్టీలు వంటి రూపాల్లో ఉండేవి. కానీ, ఇప్పుడు అవి డిజిటల్ రూపం దాల్చి అంతుచిక్కని విధంగా విస్తరించాయి. అందువల్ల ప్రజలు సైబర్ క్రైంల విషయంలో అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.