
KCL Season 3: క్రికెట్, సినిమా కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే వచ్చే ఆ మజానే వేరు. తాజాగా కేరళ క్రికెట్ లీగ్ (KCL) సీజన్ 3 కోసం రిలీజైన ప్రమోషనల్ యాడ్ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వైరల్ అవుతూ ఫుల్ వైబ్స్ ఇస్తోంది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్ ఒకే ఫ్రేమ్‌లో మెరవడంతో ఫ్యాన్స్ ఊహించని ఈ నెక్స్ట్ లెవెల్ క్రాస్‌ఓవర్ చూసి ఫిదా అయిపోతున్నారు. క్రికెట్ అండ్ మూవీ లవర్స్ ఇద్దరూ ఈ ప్రోమోను రీల్స్, స్టోరీల్లో షేర్ చేస్తూ నెట్టింట విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
టాక్సీలో సీన్ రీక్రియేషన్.. నెట్టింట వీడియో షేక్:
ఈ ప్రోమో కాన్సెప్ట్ కూడా భలే ఫన్నీగా, యూత్‌ఫుల్‌గా ప్లాన్ చేశారు. సంజు శాంసన్ టాక్సీ నడుపుతుండగా, డ్రైవర్ ఎవరని గమనించకుండా కారు వెనుక సీట్లో కూర్చున్న మోహన్‌లాల్‌కు, సంజుకు మధ్య జరిగే సరదా సంభాషణతో ఈ యాడ్ కొనసాగుతుంది. “మీకు క్రికెట్ వచ్చా చేటా? అని సంజూ అడగ్గా, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ క్యాప్టెన్ ఎవరు అనుకుంటున్నావ్!” అంటూ మోహన్‌లాల్ ఇచ్చే బిల్డప్, కామిక్ టైమింగ్ వేరే లెవెల్ అంతే.. ఆ తర్వాత వెనక్కి తిరిగి సంజు శాంసన్ ను చూసి మోహన్‌లాల్ ఇచ్చే షాకింగ్ రియాక్షన్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. సంజు స్పోర్టింగ్ క్రేజ్, మోహన్‌లాల్ స్టార్ పవర్ కలసి ఈ యాడ్‌ను గూస్‌బంప్స్ తెప్పించేలా మార్చేశాయి.
►ALSO READ | గిల్‌క్రిస్ట్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన పంత్.. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి!
ఆగస్టు 20 నుంచే KCL హంగామా:
ఈ క్రేజీ ప్రోమోతో కేరళ క్రికెట్ లీగ్ సీజన్ 3పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆగస్టు 20వ తేదీ నుంచి తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ లీగ్ మ్యాచ్‌లు ఫుల్ జోష్‌తో ప్రారంభం కానున్నాయి. లోకల్ క్రీడా ప్రతిభను వెలికితీస్తూ కొనసాగే ఈ టోర్నీకి ఈసారి సెలబ్రిటీ వైబ్స్ తోడవ్వడంతో రచ్చ రంబోలా ఖాయంగా కనిపిస్తుంది. సినిమా పవర్, క్రికెట్ ఎనర్జీ కలగలసి KCL సీజన్ 3 రికార్డు వ్యూస్ సాధిస్తుందని స్పోర్ట్స్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
Chettan and Ettan in a single frame 📽️✨📈🤩
Sanju Samson and Mohanlal for a promotional ad for KCL season 3 🔥 pic.twitter.com/8u0XnLWogb
— Sanju Samson Fans Page (@SanjuSamsonFP) August 18, 2026