
శ్రావణమాసం కొనసాగుతుంది. పూజలు.. వ్రతాలు.. నోములు ఈ నెలలోనే ఎక్కవుగా ఉంటాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ఈ ఏడాది ఆగస్టు 21 శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది. అమ్మవారిని వివిధ రకాలు అలంకరించి కలశ స్థాపన చేసి పూజలు నిర్వహిస్తారు. మరి ఆ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వత్రం రోజు ఏఏ పనులు చేయకూడదో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .!
స్కాంద పురాణం ప్రకారం.. శ్రావణమాసం చాలా పవిత్రమైనది. ఇక శుక్రవారాలు.. మంగళవారాలు.. సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. ఇక వరలక్ష్మి వ్రతం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ దేవి వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం, మంగళవారం ఎంతో ప్రత్యేకమైన రోజులని భావిస్తారు.ముఖ్యంగా ఈ రెండు రోజులు మహిళలు పెద్ద ఎత్తున మంగళగౌరీ వ్రతాన్ని, వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు.ఈ క్రమంలోనే శ్రావణమాసం రెండో శుక్రవారం (ఆగస్లు 16) మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు.నిజానికి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాలి.
చేయకూడని పనులు
- వరలక్ష్మి వ్రతం రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటివి తీసుకోకూడదు.
- బ్రహ్మాచర్యం పాటించాలి.
- పూజ చేసే సమయంలో నిద్రమత్తుగా, బద్ధకంగా, ఆవళింపులతో ఉండకూడదు.
- వరలక్ష్మీ వ్రతం రోజున చెత్తను బయట పడేయకూడదు. అలా చేస్తే సంపదను బయటకి పంపేసినట్లు అవుతుంది.
- వ్రతం రోజున చీపురతో ఇల్లు ఊడ్చడం, బట్టలు ఉతకడం చేయకూడదు.
- ఇతరులతో గొడవ పడటం, కఠినంగా మాట్లాడటం, చిరాకుగా ఉండటం చేయకూడదు. వీలైనంత వరకు ప్రశాంతమైన మనసుతో ఉండాలి.
- ఈ వ్రతం రోజున ధనాన్ని అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకూడదు.
- వెంట్రుకలు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం చేయకూడదు. వీటిని అపశకునంగా భావిస్తారు.
- పూజ కోసం తులసీ దళాలను తెంప కూడదు.
- వరలక్ష్మీ వ్రతాన్ని చేసేటప్పుడు లేదా వినేటప్పుడు మన మనసు మొత్తం అమ్మవారి పై ఉంచాలి.
- వ్రతం ఆచరించిన వారు ఆరోజు బ్రహ్మచర్యం పాటించాలి.
- వరలక్ష్మీ వ్రతం రోజు జుట్టు విరబూసుకొని ఉండకూడదు.
- ఇంట్లో దుర్గధం లేకుండా సాంబ్రాణి లేక అగరువత్తుల పొగ వేసి శుద్ధి చేయాలి.
- అపరిశుభ్రమైనవి, ఫ్యాషన్ డ్రస్సులు వేసుకోకూడదు. గృహిణులైతే తప్పక చీర కట్టుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలైతే సంప్రదాయ బట్టలు వేసుకోవాలి.
- చాలా మంది చెప్పలు పక్కకు విడువకుండా గుమ్మానికి ఎదురుగా విడిచిపెడతారు. ఇది చాలా పెద్ద దోషమని వేద పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి రావాలనుకున్న వరలక్ష్మీ దేవి అటునుంచే వెనక్కు వెళ్లిపోతుందట..
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.