
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. మంగళవారం ( ఆగస్టు 18 ) నుంచి అమల్లోకి వచ్చిన వన్ వేపై అవగాహన లేని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వన్ వే కారణంగా పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ తో పాటు, గమ్యస్థానాలకు చేరాలంటే ఆలస్యమవుతున్న క్రమంలో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కేబీఆర్ వన్ వే ట్రాఫిక్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడు రోజుల్లో ఇబ్బందులన్నీ క్లియర్ చేస్తామని… ప్రజలు తమకు సహకరించాలని కోరారు.
ఇవాళ ఉదయం 6 గంటల నుండి కేబీఆర్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చిందని.. రోడ్ నెంబర్ 45, అగ్రసేన్, వెంకటగిరి వద్ద కొన్ని ఇబ్బందులు వచ్చాయని అన్నారు. పీక్ పీరియడ్ లో సమస్యలు గుర్తించామని.. 500పైగా సిబ్బంది రోడ్ పై ఉండి మానిటరింగ్ చేశారని అన్నారు సజ్జనార్. స్పెషల్ డ్రోన్స్ ద్వారా ట్రాఫిక్ ను పర్యవేక్షించామని… కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందిని అన్నారు.
►ALSO READ | కేబీఆర్ పార్క్ చుట్టూ మూడు సార్లు తిరిగినా.వన్ వే ట్రాఫిక్ పై పబ్లిక్ పరేషాన్
ట్రాఫిక్ అడ్వైజరిని పబ్లిక్ పట్టించుకోట్లేదని.. వాటిని ఫాలో అవ్వాలని కోరుతున్నామని అన్నారు. టూ వీలర్ వాహనదారులు కొన్ని చోట్ల వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయని..రెండు మూడు రోజుల్లో ఇబ్బందులు అన్ని క్లియర్ చేస్తామని అన్నారు సజ్జనార్.