Reading Time: < 1 minute

Ram Charan-Sukumar: రంగస్థలం కాంబో రిపీట్.. RC17 స్క్రిప్ట్ రెడీ, ఇక షూటింగ్‌కు రంగం సిద్ధం!

Caption of Image.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్-ఇండియా ధమాకాలతో దుమ్మురేపుతున్నారు. ఇటీవల విడుదలైన ‘ పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. దీంతో చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కు చేరింది. ఈ ఊపే ఊపులో ఆయన తన తరువాతి ప్రాజెక్ట్‌ను  సుకుమార్‌ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యారు. వీరిద్దరి కాంబినేషన్ అంటనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. 

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం (వర్కింగ్ టైటిల్ RC17) పై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైండ్ బ్లోయింగ్ విజువల్ స్టాండర్డ్స్‌తో నిర్మించనుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వంద శాతం పూర్తయింది. ఈ నెలాఖరులోనే అత్యంత వైభవంగా ఈ చిత్రాన్ని ప్రారంభించేందుకు మేకర్స్ పూజా కార్యక్రమాలను ప్లాన్ చేస్తున్నారు.

►ALSO READ | Jananayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జననాయగన్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఈ సినిమా ఓపెనింగ్ సీన్ నాకు తెలుసు. అది థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక హార్డ్-హిట్టింగ్ షాక్‌లా ఉంటుంది అని చెప్పడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలకు బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నారు.  రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభం కానుంది. పాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ చూడని సరికొత్త మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఇందులో కథానాయికగా రాశి ఖన్నా లేదా జాన్వీ కపూర్ నటించే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. రంగస్థలం కాంబో రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయారు..

 

©️ VIL Media Pvt Ltd.