
దేశంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కొత్త ఎల్పీజీ పథకానికి రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా దేశంలో ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టనుంది. గ్యాస్ దిగుమతులకు సంబంధించి విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశంలో ఉత్పత్తిని పెంచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిపై 21 రిఫైనరీలు, అప్‌స్ట్రీమ్ కంపెనీలకు టార్గెట్ విధించింది. రోజుకు 63,810 టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. దీని వల్ల భారత్ విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది.
దిగుమతులపై ఆధారపడుతున్న భారత్..
భారత్ ఇప్పటివరకు గ్యాస్ కోసం విదేశాలపై ఎక్కవ ఆధారపడుతుంది. ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. దీని వల్ల అంతర్జాతీయంగా యుద్దాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు సరఫరా వ్యవస్థ నిలిచిపోవడం వల్ల దేశంలో గ్యాస్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీని వల్ల గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్దం వల్ల హర్ముజ్ జలసంధి మూతపడటంతో దేశంలో గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీని వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయంగా సంఘర్షణలు ఏర్పడినప్పుడు దేశంలో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది.
కంపెనీలకు కొత్త లక్ష్యం
ప్రస్తుతం దేశంలో రోజువారీ గ్యాస్ వినియోగం 91 వేల టన్నులుగా ఉంది. కంపెనీలు రోజుకు 63,180 టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టగా.. ఇది 70 శాతానికి సమానం. దీని వల్ల సంక్షోభ సమయంలో అదనపు నిల్వలు ఉంటాయి. గల్ఫ్ దేశాల నుంచి భారత్ ఎక్కువగా ఎల్పీజీని దిగుమతి చేసుకుంటుంది. ఈ దేశాల నుంచి 90 శాతం దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఇటీవల గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో దేశంలో గ్యాస్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఈ అనుభవంతో దేశంలోనే గ్యాస్ ఉత్పత్తిని పెంచుకోవాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇందులో భాగంగా కంపెనీలకు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో దేశంలో గ్యాస్ కొరత అనేది ఉండదు. అంతర్జాతీయంగా యుద్దాలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూాడాలి