
తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్ కం రైల్వే వంతెన పైనుంచి గోదావరిలో దూకి ప్రభుత్వ అధికారి కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నంచేసుకున్నారు. భార్య,భర్త,కుమార్తె సహా ముగ్గురు గల్లంతు కాగా…10 సంవత్సరాల మనవడిని స్థానికులుకాపాడారు.
పిఠాపురం పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నూకరాజు కుటుంబ సభ్యులుగా గుర్తించారు. గజతగాళ్లు… పోలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్గొన్న పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజుకుసంబంధించిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ లేఖలో ఆయన కుటుంబం వేధింపులకు గురి అవుతున్న సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తన అల్లుడు మరణించిన తర్వాత కుమార్తెను షేక్ సాదిక్ అనే వ్యక్తి వేధిస్తున్నాడని సూసైడ్ లెటర్ లో
ఏఈ నూకరాజు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కు తన మరణ వాంగ్మూలం రాసుకున్నారు.
ఆ వ్యక్తి కారణంగా తన కుమార్తెకు, మనవడికీ ప్రాణహాని కారణంగా మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఏఈ నూకరాజు రాశారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.