
Arjuna Awards: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను ప్రకటించింది. స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ నేతృత్వంలో మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు దక్కింది. అయితే, ఈ సంవత్సరం అత్యున్నత క్రీడా పురస్కారమైన ఖేల్ రత్నను ఎవరికీ ప్రకటించకపోవడం గమనార్హం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ అందించిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ పురస్కారాలను ఖరారు చేసింది.
ప్రతిభ చూపిన దిగ్గజాలకు అర్జున అవార్డు: –
కామన్‌వెల్త్ గేమ్స్ డెకాథ్లాన్‌లో భారత్‌కు తొలి పతకం (కాంశ్యం) అందించిన అథ్లెట్ తేజస్విన్ శంకర్, జార్జియాలో జరిగిన ఎఫ్‌ఐడీఈ (FIDE) మహిళల ప్రపంచ కప్ 2025ను గెలుచుకుని భారత 4వ మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్, బ్యాడ్మింటన్ స్టార్ జంట గాయత్రి గోపీచంద్ – త్రీసా జాలీ, చెస్ గ్రాండ్‌మాస్టర్ విదిత్ గుజరాతి ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు సాధించారు. అలాగే, 1962 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యుడు ఐ. అరుణై నాయగంకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ కేటగిరీ కింద అర్జున అవార్డును ప్రకటించారు.
అవార్డుల ప్రకటనలో ఆలస్యానికి కారణాలు:
సాధారణంగా ప్రతి ఏటా హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న (జాతీయ క్రీడా దినోత్సవం) రాష్ట్రపతి భవన్‌లో ఈ అవార్డులను ప్రదానం చేసేవారు. అయితే ఎంపిక కమిటీ ఆరు నెలల క్రితమే నివేదిక సమర్పించినప్పటికీ, పురస్కారాల పారదర్శకతను కాపాడేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ చేపట్టిన పునఃపరిశీలన (సమీక్ష) వల్ల ప్రకటన ఆలస్యమైంది. 2020 కొవిడ్ మహమ్మారి తర్వాత, అంతర్జాతీయ పోటీలు, క్రీడా క్యాలెండర్‌కు అనుగుణంగా ఈ ప్రదానోత్సవ తేదీలను సవరిస్తున్నారు.
అర్జున అవార్డుల పూర్తి జాబితా :
* అథ్లెటిక్స్: తేజస్విన్ శంకర్, ముహమ్మద్ అజ్మల్ వి, ప్రియాంక గోస్వామి
* బ్యాడ్మింటన్: త్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్
* బాక్సింగ్: నరేందర్
* చెస్: విదిత్ సంతోష్ గుజరాతి, దివ్య జితేంద్ర దేశ్‌ముఖ్
* డెఫ్ షూటింగ్: ధనుష్ శ్రీకాంత్
* హాకీ: లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్
* కబడ్డీ: సుర్జీత్, పూజ
* పారా షూటింగ్: రుద్రాంష్ ఖండేల్‌వాల్
* పారా అథ్లెటిక్స్: ఏక్తా భ్యాన్
* రోయింగ్: అర్వింద్ సింగ్
* షూటింగ్: అఖిల్ షెయోరాన్
ALSO READ : స్టేడియంలో విషాదం.. బ్యాటర్ కొట్టిన బంతి ముఖానికి తగిలి ఐసీయూలో అంపైర్!
అర్జున అవార్డు (లైఫ్‌టైమ్):
* ఫుట్‌బాల్: ఐ. అరుణై నాయగం
ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్):
* పర్వీర్ సింగ్ (అథ్లెటిక్స్)
* ఛోటే లాల్ యాదవ్ (బాక్సింగ్)
* నేహా నంద్ కుమార్ చవాన్ (షూటింగ్)
ద్రోణాచార్య అవార్డు (లైఫ్‌టైమ్):
* ధర్మేంద్ర సింగ్ యాదవ్ (బాక్సింగ్)
* వీరేందర్ కుమార్ (రెజ్లింగ్)
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం:
* ఆర్మీ పారాలింపిక్ నోడ్
* పూణే (క్రీడల ప్రోత్సాహం, అభివృద్ధి)
𝐆𝐨𝐯𝐞𝐫𝐧𝐦𝐞𝐧𝐭 𝐚𝐧𝐧𝐨𝐮𝐧𝐜𝐞𝐬 𝐭𝐡𝐞 𝐍𝐚𝐭𝐢𝐨𝐧𝐚𝐥 𝐒𝐩𝐨𝐫𝐭𝐬 𝐀𝐰𝐚𝐫𝐝𝐬 𝟐𝟎𝟐𝟓.
Badminton stars Treesa Jolly and Pullela Gayatri Gopichand, along with 15 other sportspersons from various disciplines, will receive the Arjuna Award for outstanding performance… pic.twitter.com/fu234DlXog
— All India Radio News (@airnewsalerts) August 18, 2026