Reading Time: < 1 minute
Rapo23 Cast Update Riteish Deshmukh To Play Villain In Ram Pothinenis Next

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం RAPO23. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ ఇటీవల పాండిచ్చేరిలో భారీ సెటప్‌లో టీమ్ 9 రోజుల పాటు షూటింగ్ చేశారు. వర్షాల కారణంగా షెడ్యూల్‌కు బ్రేక్ పడింది. అయితే ఈ సినిమాలో హీరోకు సమానమైన విలన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ గట్టిగా శ్రమిస్తోంది.

సినిమాలోని నెగెటివ్ రోల్ కోసం మేకర్స్ ముందుగా మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాసిల్ ను సంప్రదించారట. అయితే డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఆ తర్వాత కోలీవుడ్ పాపులర్ విలన్ ఎస్‌జే సూర్యను అప్రోచ్ అయ్యారు. అయితే ఆయన ఈ పాత్ర కోసం దాదాపు రూ. 7 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ రేంజ్ రెమ్యునరేషన్ బడ్జెట్ పరిమితులకు మించడంతో మేకర్స్ ప్రత్యామ్నాయం వైపు చూశారు. చివరకు ఈ పవర్ ఫుల్ యాంటాగొనిస్ట్ రోల్ కోసం బాలీవుడ్ హీరో రితీష్ దేశ్‌ముఖ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. జెనీలియా భర్త అయిన రితీష్, రామ్ పోతినేనికి మంచి ఆత్మీయుడు, ప్రాణస్నేహితుడు. ఈ క్యారెక్టర్‌కి రితీష్ అయితే కొత్తదనంతో పాటు పాన్-ఇండియా అప్పీల్ వస్తుందని భావించి మేకర్స్ ఆయన వైపు మొగ్గు చూపారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సామ్ సీయస్ సంగీతం అందిస్తున్నాడు.