Reading Time: 2 minutes

లీవ్ పాలసీ మార్చేసిన యాక్సెంచర్.. సెలవులు తీసుకోవద్దంటూ టెక్కీలకు రిక్వెస్ట్

Caption of Image.

యాక్సెంచర్ కంపెనీలో సెలవుల పాలసీపై తీసుకున్న సరికొత్త నిర్ణయం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థిక సంవత్సరాన్ని విజయవంతంగా ముగించే లక్ష్యంతో సీఈఓ జూలీ స్వీట్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఆసక్తికరమైన వ్యూహం దాగి ఉంది.

యాక్సెంచర్ సంస్థ ఆర్థిక సంవత్సరం ఆగస్టు 31తో ముగుస్తుంది. అయితే ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు కాకపోవడం.. కొత్త బుకింగ్స్‌లో 2 శాతం క్షీణత కనిపించడం కంపెనీని ఆందోళనకు గురిచేసింది. దీనికితోడు Q4 రెవెన్యూ అంచనాలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా ఉండటంతో.. జూన్ నెలలో కంపెనీ షేర్లు కేవలం ఒక్కరోజే దాదాపు 20 శాతం పడిపోయాయి. AI వల్ల సాంప్రదాయ కన్సల్టింగ్ సేవలకు డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లలో పెరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే షేర్‌హోల్డర్ల అంచనాలను అందుకునేందుకు, సేల్స్ రెవెన్యూను భారీగా పెంచేందుకు సీఈఓ జూలీ స్వీట్ ఉద్యోగులకు ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చారు. క్యూ-4 ఫైనాన్షియల్ టార్గెట్స్ సాధించడం కోసం ప్రతి ఒక్కరూ క్లైంట్ల కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని.. చిన్న, పెద్ద, మెగా సేల్స్‌ను మరింత బలంగా క్లోజ్ చేయాలని ఆమె కోరారు.

►ALSO READ | 9 ఏళ్లలో రూ.2 లక్షల ప్యాకేజీ నుంచి రూ.75 లక్షలకు శాలరీ వరకు.. డిగ్రీతో యువకుడి అద్భుత ప్రయాణం!

ఈ లక్ష్య సాధనలో భాగంగానే యాక్సెంచర్ తన వెకేషన్ పాలసీలో ఒకే ఒక్కసారికి వర్తించేలా సంచలన మార్పు చేసింది. సాధారణంగా కంపెనీ రూల్స్ ప్రకారం ఉద్యోగులు తమకు కేటాయించిన సెలవులను ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖచ్చితంగా వాడేసుకోవాలి.. లేదంటే అవి ఎక్స్పైర్ అవుతాయి. కానీ ఈ ఏడాది మాత్రం ఉద్యోగులు ఉపయోగించకుండా మిగిలిపోయిన లీవ్స్‌ను రాబోయే ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.

సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం లేదా వేసవిలో ఉద్యోగులు లీవ్స్ పెట్టి వెకేషన్స్‌కు వెళ్తుండటం సహజం. అయితే ఈ తాత్కాలిక మార్పు ద్వారా ఉద్యోగులు తమ సెలవులు ఎప్పుడైనా ఉపయోగించుకునేలా ఫ్లెక్సిబిలిటీ లభించడంతో పాటు, అత్యంత కీలకమైన ఆగస్టు నెలలో ఎవరూ లీవ్స్‌పై వెళ్లకుండా అందరూ ఆఫీసులో అందుబాటులో ఉండేలా మేనేజ్‌మెంట్ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది. మొత్తానికి ఉద్యోగులకు సెలవుల రూపంలో ఊరటనిస్తూనే.. క్లిష్ట పరిస్థితిలో కంపెనీని గట్టెక్కించేందుకు జూలీ స్వీట్ వేసిన ప్లాన్ ఐటీ ఇండస్ట్రీల్ హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగులు కూడా దీనికి సానుకూలంగా స్పందిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.