Reading Time: 2 minutes

ప్రయాణికులకు బిగ్ అలర్ట్: KBR పార్క్ చుట్టూ మారిన బస్ రూట్లు.. కొత్త రూట్లు, స్టాప్‎లు ఇవే

Caption of Image.

హైదరాబాద్: హెచ్‌‌సిటీ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ మంగళవారం (ఆగస్ట్ 18) నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్థం కేబీఆర్ పార్క్ చుట్టూ రూట్లలో పలు మార్పులు, కొత్త స్టేజీలు ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు కొత్త బస్ రూట్ల మ్యాప్ మంగళవారం (ఆగస్ట్ 18) విడుదల చేసింది. ప్రధానంగా 127, 222A, 47L 10H బస్ రూట్లు మారాయి.  ప్రయాణికులు మారిన రూట్లు, బస్సు స్టాప్‌లను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

127K బస్సు రూట్ ఇదే

కోఠి నుంచి కొండాపూర్: కోఠి → లక్డీ కపూల్ → మాసబ్ ట్యాంక్ → పెన్షన్ హౌస్ → ఎమ్మెల్యే కాలనీ → అపోలో → రోడ్ నంబర్ 45 → మాదాపూర్ పీఎస్ → కొండాపూర్

కొండాపూర్ నుంచి కోఠి: కొండాపూర్ → మాదాపూర్ పీఎస్ → రోడ్ నంబర్ 45 → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → పెన్షన్ హౌస్ → మాసబ్ ట్యాంక్ → కోఠి

10H బస్ రూట్ 

సికింద్రాబాద్ నుంచి కొండాపూర్: సికింద్రాబాద్ → బేగంపేట → మైత్రివనం → యూసఫ్‌గూడ ఎక్స్‌రోడ్స్ → వెంకటగిరి → నవయుగ → పెద్దమ్మగుడి → మాదాపూర్ పీఎస్ → కొండాపూర్.

కొండాపూర్ నుంచి సికింద్రాబాద్: కొండాపూర్ → పెద్దమ్మగుడి → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → వెంకటగిరి → యూసఫ్‌గూడ → మైత్రివనం → బేగంపేట → సికింద్రాబాద్.47L రూట్‌లో మార్పులు

47L రూట్‌లో మార్పులు

సికింద్రాబాద్ నుంచి మణికొండ: సికింద్రాబాద్ → బేగంపేట → నాగార్జున సర్కిల్ → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → ఒమేగా → అపోలో ఆస్పత్రి → ఫిల్మ్‌నగర్ → దర్గా → మణికొండ.

మణికొండ నుంచి సికింద్రాబాద్: మణికొండ → పంచవటి కాలనీ → దర్గా → ఫిల్మ్‌నగర్ → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → టీవీ9 → పంజాగుట్ట పీఎస్ → ఆర్‌జే కాలేజీ → పోలీస్ లైన్ → ప్లాజా → సికింద్రాబాద్.

222A రూట్‌

కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి → లకడీకపూల్ → మసబ్ ట్యాంక్ → నాగార్జున సర్కిల్ → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → ఒమేగా → అపోలో → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → పెద్దమ్మగుడి → మాదాపూర్ పీఎస్ → పటాన్‌చెరు.

పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు → మాదాపూర్ పీఎస్ → పెద్దమ్మగుడి → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → నాగార్జున సర్కిల్ → మాసబ్ ట్యాంక్ → లక్డీ కపూల్ → కోఠి

 

►ALSO READ | కేసీఆర్‎ది ఫ్యామిలీ జస్టిస్.. నాది సోషల్ జస్టిస్: సీఎం రేవంత్

©️ VIL Media Pvt Ltd.