Reading Time: 2 minutes
Jubilee Hills One Way Rules Tgsrtc Bus Route Changes

TGSRTC Bus Route Changes: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా వన్‌వే నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా టీజీఎస్‌ఆర్టీసీ కీలక మార్పులు చేసింది. పలు ప్రధాన రూట్లలో బస్సుల ప్రయాణ మార్గాలు, స్టాప్‌లను క్రమబద్ధీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ రూట్లలో మార్పులు

ప్రధానంగా 127K, 222A, 47L, 10H రూట్లలో బస్సుల ప్రయాణ మార్గాలను మార్చారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మారిన రూట్లు, బస్సు స్టాప్‌లను గమనించాలని అధికారులు సూచించారు.

47L రూట్‌లో మార్పులు
* సికింద్రాబాద్ నుంచి మణికొండ: సికింద్రాబాద్ → బేగంపేట → నాగార్జున సర్కిల్ → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → ఒమేగా → అపోలో ఆస్పత్రి → ఫిల్మ్‌నగర్ → దర్గా → మణికొండ.

* మణికొండ నుంచి సికింద్రాబాద్: మణికొండ → పంచవటి కాలనీ → దర్గా → ఫిల్మ్‌నగర్ → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → టీవీ9 → పంజాగుట్ట పీఎస్ → ఆర్‌జే కాలేజీ → పోలీస్ లైన్ → ప్లాజా → సికింద్రాబాద్.

10H రూట్ ఇలా..
* సికింద్రాబాద్ నుంచి కొండాపూర్: సికింద్రాబాద్ → బేగంపేట → మైత్రివనం → యూసఫ్‌గూడ ఎక్స్‌రోడ్స్ → వెంకటగిరి → నవయుగ → పెద్దమ్మగుడి → మాదాపూర్ పీఎస్ → కొండాపూర్.

* కొండాపూర్ నుంచి సికింద్రాబాద్: కొండాపూర్ → పెద్దమ్మగుడి → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → వెంకటగిరి → యూసఫ్‌గూడ → మైత్రివనం → బేగంపేట → సికింద్రాబాద్.

222A రూట్‌లోనూ మార్పులు
* కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి → లకడీకపూల్ → మసబ్ ట్యాంక్ → నాగార్జున సర్కిల్ → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → ఒమేగా → అపోలో → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → పెద్దమ్మగుడి → మాదాపూర్ పీఎస్ → పటాన్‌చెరు.

* పటాన్‌చెరు నుంచి కోఠి: పటాన్‌చెరు → మాదాపూర్ పీఎస్ → పెద్దమ్మగుడి → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → నాగార్జున సర్కిల్ → మసబ్ ట్యాంక్ → లకడీకపూల్ → కోఠి.

127K బస్సు రూట్ ఇదే
* కోఠి నుంచి కొండాపూర్: కోఠి → లకడీకపూల్ → మసబ్ ట్యాంక్ → పెన్షన్ హౌస్ → ఎమ్మెల్యే కాలనీ → అపోలో → రోడ్ నంబర్ 45 → మాదాపూర్ పీఎస్ → కొండాపూర్.

* కొండాపూర్ నుంచి కోఠి: కొండాపూర్ → మాదాపూర్ పీఎస్ → రోడ్ నంబర్ 45 → జర్నలిస్ట్ కాలనీ → జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ → అన్నపూర్ణ స్టూడియో → ఎల్‌వీ ప్రసాద్ → బసవతారకం హాస్పిటల్ → బీఆర్ఎస్ భవన్ → ఎమ్మెల్యే కాలనీ → పెన్షన్ హౌస్ → మసబ్ ట్యాంక్ → కోఠి.

ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ సూచన
జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, రోడ్ నంబర్ 45, కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు మారిన బస్సు రూట్లు, స్టాప్‌లను ముందుగానే గమనించి ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే అదనపు బస్సు సర్వీసులను కూడా నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.