
కొన్నిసార్లు నిర్లక్ష్యంగా తీసుకునే నిర్ణయాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ముఖ్యంగా రోడ్లు దాటేటపుడుగానీ , రైల్వే పట్టాలు క్రాస్ చేసేటప్పుడు ఏంకాదులే అనే ధోరణిలో ఉంటే ప్రాణాలతో చెలగామాడినట్టే.. ఊహించని ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవచ్చు.. అలాంటి ఘటనే సికింద్రాబాద్ పరిధిలోని మౌలాలి రైల్వే స్టేషన్ లో జరిగింది. ఆదివారం (ఆగస్టు16) సాయంత్రం ఓ యువతి మౌలాలి రైల్వే స్టేషన్ లో ఓ ఫ్లాట్ ఫాం నుంచి మరో ప్లాట్ ఫాంకు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండా ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే..
మౌలాలి రైల్వేస్టేషన్ లోని LC గేట్ నంబర్ 6 దగ్గర ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రైలు దిగి ప్లాట్ ఫాంనుంచి మరో ప్లాట్ ఫాం వెళ్తున్న యువతిని వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొంది. రైలు వేగంగా యువతిని ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై స్పాట్ లోను చనిపోయింది. చూస్తుండగానే కళ్లముందే యువతి చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు బోరున విలపించారు.
యువతి స్వస్థలం జనగామ కాగా.. ప్రస్తుతం మౌలాలి హౌసింగ్ బోర్డులో నివాసముంటున్నట్టు గుర్తించారు పోలీసులు. పేరెంట్స్ తో కలిసి జనగామ నుంచి గోల్కొండ ఎక్స్‌ప్రెస్ లో మౌలాలికి వచ్చినట్టు తెలుస్తోంది. పట్టాలు దాటుతున్ సమయంలో విశాఖపట్నంనుంచి సికింద్రాబాద్ వస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.