Reading Time: < 1 minute
Siwan Sp Removed Ak 47 Student Protests Bihar

Bihar:  జూలై 25న బీహార్‌లో విద్యార్థి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపిన సంఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పోలీస్ కానిస్టేబుల్ అల్లర్లను అడ్డుకునే నేపథ్యంలో ఏకే-47తో కాల్పులు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన వివాదాస్పదం కావడంతో బీహార్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సివాన్ జిల్లా ఎస్పీ పురన్ కుమార్ ఝాను పదవి నుంచి తొలగించింది.

ఈ ఘనటలో ఏకే -47తో కాల్పులు జరిపిన కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు. జూలై 25న సివాన్‌లోని జేపీ చౌక్‌ సమీపంలో విద్యార్థులు నిరసన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. నిరసనకారుల మధ్య చిక్కుకుపోయిన పరిస్థితుల్లో కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఏకే-47తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఇవి గాల్లోకి కాల్పిన కాల్పులే అని బీహార్ ప్రభుత్వం చెప్పింది.

ఈ నాలుగు రౌండ్ల కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని బీహార్ సర్కార్ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నేతృత్వంలో ఉద్యమానికి సంబంధించిన నిరసనల్లో పోలీసులుకు బలప్రయోగం చేశారని దాఖలైన పిటిషన్లపై జరుగుతున్న విచారణలో భాగంగా బీహార్ ప్రభుత్వం ఈ వివరాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది.