
Devdutt Padikkal Records: శ్రీలంకతో గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టులోకి రీఎంట్రీ స్టార్ దేవదత్ పడిక్కల్ మధ్య మధ్యలో వర్షం ఆటంకం కలిపించిన కూడా కిరాక్ బ్యాటింగ్ చేశాడు. తొలి రోజు అజేయంగా 131 పరుగులతో క్రీజులో నిలిచిన ఈ కుర్రాడు.. రెండో రోజు ఆటలోనూ అదే రేంజ్ క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్ తో ఏకంగా 167 పరుగులు (230 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్) సాధించి పెవిలియన్ చేరాడు. పడిక్కల్ వీరోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా స్కోరు బోర్డు 350 మార్కును సునాయాసంగా దాటేసింది. గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో వచ్చిన అవకాశాన్ని పడిక్కల్ రెండు చేతులా క్యాచ్ పట్టుకుని, నెంబర్ –3 స్థానంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు.
ద్రవిడ్, పుజారా రికార్డులు బ్రేక్.. లంక గడ్డపై పడిక్కల్ తోపు:
శ్రీలంక గడ్డపై మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఛేటేశ్వర్ పుజారా (153 పరుగులు – గాలే, 2017) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును దుమ్ముదులిపేసి నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు. అంతేకాకుండా, లంకపై ఓవరాల్‌గా టెస్టుల్లో 150 కంటే ఎక్కువ రన్స్ చేసిన రాహుల్ ద్రవిడ్ (177), పుజారా (153)ల రేర్ అండ్ ఎలైట్ క్లబ్‌లో పడిక్కల్ మూడో భారత బ్యాటర్‌గా చేరిపోయాడు.
నెంబర్–3లో లంక గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్లు చేసిన భారత బ్యాటర్లు:
* 167 – దేవదత్ పడిక్కల్ (గాలే, 2026)
* 153 – చేతేశ్వర్ పుజారా (గాలే, 2017)
* 133 – ఛేటేశ్వర్ పుజారా (కొలంబో, 2017)
* 126 – అజింక్య రహానే (కొలంబో, 2015)
* 125 – వినోద్ కాంబ్లీ (కొలంబో, 1993)
సచిన్, సెహ్వాగ్ దారిలో పడిక్కల్.. గాలే గ్రౌండ్‌లో రికార్డుల మోత:
శ్రీలంకలో టెస్టు మ్యాచ్ ఆడుతూ 150+కి పైగా పరుగులు సాధించిన ఐదో భారత బ్యాటర్‌గా పడిక్కల్ రికార్డుల్లోకెక్కాడు. గతంలో సచిన్ టెండూల్కర్ (203), వీరేందర్ సెహ్వాగ్ (201*), శిఖర్ ధావన్ (190), ఛేటేశ్వర్ పుజారా (153) మాత్రమే ఈ ఫీట్ సాధించారు. ఇప్పుడు పడిక్కల్ (167) ఆ లెజెండ్స్ సరసన నిలిచాడు. అంతేకాదు, గాలే అంతర్జాతీయ స్టేడియంలో 150+ కొట్టిన నాల్గవ భారత బ్యాటర్‌గానూ రికార్డు నమోదు చేశాడు. 2024 తర్వాత దాదాపు రెండేళ్ల విరామం అనంతరం జట్టులోకి వచ్చి, లభించిన ఏకైక అవకాశంలోనే భారీ రికార్డులు నెలకొల్పిన పడిక్కల్ కిరాక్ ఇన్నింగ్స్‌పై క్రీడా ప్రపంచం ప్రశంసల వర్షం కురిపిస్తోంది.