Reading Time: < 1 minute

ఎంగేజ్ చేసే సాV3

Caption of Image.

సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత లీడ్ రోల్స్‌‌లో కృష్ణమాయ దర్శకత్వంలో వి. విజయ నిర్మించిన చిత్రం ‘సాV3’.   చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌‌కు  రెడీ అవుతోంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.

 అతిథిగా హాజరైన నిర్మాత అశోక్‌‌ కుమార్ సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న  సింగర్ రాము రాథోడ్, నటుడు సంజయ్ తుమ్మ, నటి హారిక, రీతు చౌదరి టీజర్ చాలా బాగుందని టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. ఈ సినిమాలో తన పాత్ర కొత్తగా ఉంటుందని, ఇది తనకు రీలాంచ్ లాంటిదని సామ్రాట్ అన్నాడు. ప్రేక్షకులందరినీ ఎంగేజ్ చేసే చిత్రమిది అని డీమోన్ పవన్ అన్నాడు. ఈ చిత్రంతో ప్రేక్షకుల ఆదరణ, అభిమానం పొందుతాననే నమ్మకం ఉందని లిఖిత చెప్పింది.  టీజర్ కంటే సినిమాలో మరింత స్ట్రాంగ్ కంటెంట్ ఉంటుందని డైరెక్టర్ కృష్ణమాయ అన్నాడు. ఈ సినిమా విజయంపై  కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని నిర్మాత వి విజయ అన్నారు.

©️ VIL Media Pvt Ltd.