Reading Time: 2 minutes

ప్రతి ఆరు నెలలకో.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

ప్రజాప్రభుత్వంలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యానికి అధికంగా నిధులు ఇచ్చామన్నారు. పేదల వైద్యం కోసం 5వేల 226 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో పేదవాడికి వైద్యం అత్యంత ఖరీదైనదిగా మారింది.. అందుకే  కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ రంగంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని చెప్పారు సీఎం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం.. రానున్న రోజుల్లో ఆరు నెలల కొక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తెస్తామన్నారు. 

ప్రజాప్రభుత్వం వచ్చాక విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  తెలంగాన నర్సింగ్ కాలేజీ అమ్మాయిలు మిడిల్ ఈస్టు దేశాల్లో సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతోంది.. తెలంగాణ బిడ్డలు స్కిల్స్ పెంచుకొని అంతర్జాతీయ స్థాయిలో  సేవలందించాలని కోరారు. 

ప్రజాప్రభుత్వంలో వైద్య రంగానికి ప్రాధాన్యత పెంచామన్నారు సీఎం. వైద్యశాఖలో ఇప్పటికే 16 వేల మంది సిబ్బందిని నియమించామన్నారు. వైద్యం, విద్యలో పెట్టబడే .. భవిష్యత్ పెట్టుబడులు భావిస్తున్నామని సీఎం చెప్పారు. 32 నెలల పాలనలో  ఆరోగ్యశ్రీ కోసం రూ.2700 కోట్లు ఖర్చు చేసి  ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు పేదలకు  వైద్య సేవలందిస్తున్నామన్నారు. పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2వేల 526 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా రూ.5226 కోట్లు వైద్యంలో పేదవాళ్ల కోసం ఖర్చు చేశామని దేశంలో ఏ రాష్ట్రం ఈ స్థాయిలో వైద్యానికి ఖర్చు చేయలేదని అన్నారు సీఎం. 

►ALSO READ | సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిని.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులకు శంకుస్థాపనలు చేసి గాలికి వదిలేసిందన్నారు.రాష్ట్రంలోపేదలకు వైద్యం అందిస్తున్న ఉస్మానియాను  బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదన్నారు.  ప్రజాప్రభుత్వంలో 30 ఎకరాల్లో 2700 కోట్లతో గోషామహల్ దగ్గర మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తు్న్నామన్నారు సీఎం.  ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి పూర్తియితే 10వేల బెడ్స్ వైద్య సేవలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి ఆరు నెలలకో ఆస్పత్రిని పూర్తి చేసి 2027 డిసెంబర్ లోగా ఉస్మానియా, అల్వాల్, ఎల్బీ నగర్, వరంగల్ ఆస్పత్రులను ప్రజల వైద్యంకోసం అందుబాటులోకి తెస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  

ప్రభుత్వ ఆస్పత్రులపై  ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు సీఎం.ఆస్పత్రికి వచ్చే  పేషెంట్లు, వారి సహాయకులకు భోజనం, డార్మిటరీ పెడతామన్నారు. 70 శాతానికి పైగా పేదలకు ఆస్పత్రులలో నర్సింగ్ విద్యార్థులే వైద్యం అందిస్తారు ..ప్రజాప్రభుత్వం వారికి ప్రాధాన్యత కల్పి్స్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఆపరేషన్లు నిర్వహించే డాక్టర్లకు స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.  

©️ VIL Media Pvt Ltd.