మీరు ఇప్పటి వరకు ఈ మొక్కల ఆకుల పచ్చడినే చూశారు. కానీ, దీని కాయలతో కూడా పచ్చడి చేసుకుని తింటారు. ఈ విషయం చాలా మందికి తెలీదు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
గోంగూర కాయల పచ్చడికి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల గోంగూర కాయలు , ఒక కప్పు గోంగూర ఆకులు, 10 ఎండు మిరపకాయలు,
ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మెంతులు, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు,
ఇంకా కొద్దిగా చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను తీసుకోవాలి.
గోంగూర కాయల పచ్చడి తాలింపుకు : ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు,
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 4 వెల్లుల్లి ఉన్నాయి. వీటిని సరైన కొలతలతో చేసి తింటే యమా రుచిగా ఉంటుంది.
గోంగూర కాయల పచ్చడి తయారీ విధానం : ముందుగా గోంగూర కాయలు తీసుకుని వాటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసి 3 మిరపకాయలు, కొద్దిగా ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా మెంతులు కూడా వేయించాలి. అలాగే, ఈ గోంగూర కాయలు కూడా వేయించాలి.
గోంగూర కాయల పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : ఆ తర్వాత గోంగూర ఆకులు వేసి ఉడికించి దీనిలో వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు, ఇంకా ఈ చింతపండును కలిపి మిక్సీలో పట్టుకోవాలి. ఆ తరువాత గోంగూర కాయలు కూడా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని పోపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో తినడమే. సీసాలో పెట్టి నిల్వ చేసి కూడా తినొచ్చు.




