
పేరున్న పెద్దపెద్ద కాలేజీల్లో డిగ్రీలు, ఇంజనీరింగ్ చదవకపోతే కెరీర్‌లో రాణించలేమనే అపోహలను పటాపంచలు చేస్తూ ఓ కుర్రోడు సంచలనం సృష్టించాడు. సాధారణ టైర్-3 కాలేజీలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసి, కేవలం వార్షిక వేతనం రూ. లక్షా 84వేలతో తన ఉద్యోగ ప్రయాణాన్ని ప్రారంభించాడు. కట్ చేస్తే సరిగ్గా తొమ్మిదేళ్లలో తన జీతాన్ని ఏడాదికి రూ. 75 లక్షలకు పెంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. జాబ్ సేఫ్టీ లేదనే భయంతో సతమతమయ్యే నిరుద్యోగులకు, యువతకు ఇతని ప్రయాణం ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో కొలువు దక్కించుకున్నప్పటికీ.. తొలి రోజుల్లో జీతం చాలా తక్కువగానే ఉండేది. నాలుగేళ్ల పాటు జీతం ఆశించిన స్థాయిలో పెరగలేదు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అతని వేతనం సుమారు రూ.4.5 లక్షలకు చేరుకుంది. అదే సమయంలో మార్కెట్లో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుని ‘బిగ్ ఫోర్’ సంస్థలోకి మారడంతో అతని సంపాదన రూ.8 లక్షలకు పెరిగింది. అక్కడి నుంచి అసలు ప్రయాణం మొదలైంది. తాను చేస్తున్న పనిపై అసంతృప్తి ఉన్నప్పటికీ.. వెనకడుగు వేయకుండా సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుంటూ ముందుకు సాగాడు.
From 1.84LPA to 75LPA in 9 years.
No BTech. Passed out from a Tier-3 college.
This is how he achieved it: pic.twitter.com/pJjQQGcfaA
— Swapna Kumar Panda (@swapnakpanda) August 16, 2026
మొదటి ఆఫర్‌ను గుడ్డిగా అంగీకరించకుండా గట్టిగా చర్చలు జరిపి, కేవలం ఒక్క సంవత్సరంలోనే తన జీతాన్ని రూ.17 లక్షలకు పెంచుకున్నాడు. ఆ తర్వాత క్రమంగా గ్రో అవుతూ రూ.30 లక్షల స్థాయికి చేరాడు. మెరుగైన ప్యాకేజీ, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మరో స్టార్టప్ కంపెనీకి మారడంతో వేతనం రూ.42 లక్షలకు చేరింది. కెరీర్‌లో అనుకోని ఎదురుదెబ్బ తగులుతూ ఆ సంస్థలో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆ లేఆఫ్‌ను కుంగిపోయే అంశంగా కాకుండా.. మరింత మెరుగైన అవకాశం కోసం దొరికిన అరుదైన అవకాశంగా మార్చుకున్నాడు ఆ కుర్రోడు.
ALSO READ : రాసి పెట్టి ఉంటే ఎలాగైనా వస్తుంది : లాటరీలో వాచ్ మెన్ రూ.26 లక్షలు గెలిచాడు..
అలా మరో స్టార్టప్‌లో భారీ హోదాను దక్కించుకున్నాడు. దీంతో అతని శాలరీ ఒక్కసారిగా రూ. 75 లక్షల భారీ ప్యాకేజీకి చేరుకుంది. ఈ తొమ్మిదేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో డిగ్రీల కంటే అంకితభావం, నిరంతర అభ్యాసం, సమయానుకూల నిర్ణయాలే ఉద్యోగంలో నిలబెడతాయని నిరూపించాడు. సరైన నైపుణ్యాలు ఉంటే ఎంతటి సవాళ్లనైనా ఎదుర్కొని ముందుకెళ్లి అసాధారణమైన అంశాలను సాధించొచ్చని ఈ యువకుడి జర్నీ నిరూపించింది. పెద్ద కాలేజీలు, పెద్దపెద్ద కోర్సులు ఉన్నంత మాత్రాన హై ప్యాకేజీ జాబ్స్ వస్తాయ్ అనే భావన తప్పని తన సక్సెస్ స్టోరీతో నిరూపించాడు.