Reading Time: 2 minutes

Anirudh Kavya: అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి ఫిక్స్.. వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు వైరల్

Caption of Image.

సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ CEO కావ్య మారన్ మధ్య రిలేషన్‌షిప్ ఉందంటూ చాలాకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో న్యూస్ సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది ఈ వార్తలకు మరోసారి ఊపొచ్చింది. వీరిద్దరూ నవంబర్‌లో గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారంటూ రూమర్లు మరోసారి వైరల్ అవుతున్నాయి. 

నవంబర్ 10న గ్రీస్‌లో పెళ్లి?

తాజా రిపోర్టుల ప్రకారం నవంబర్ 10, 2026న గ్రీస్‌లో అనిరుధ్–కావ్య వివాహం జరగొచ్చని ప్రచారం జరుగుతోంది. మరికొన్ని కథనాల్లో నవంబర్ 11 తేదీ కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే పెళ్లి జరిగే ఖచ్చితమైన వేదిక, గెస్ట్ లిస్ట్, ఇతర ఏర్పాట్ల వివరాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. ముఖ్యంగా అనిరుధ్ లేదా కావ్య మారన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్న గ్రీస్ వెడ్డింగ్, నవంబర్ 10 తేదీని ప్రచారంగానే చూడాల్సి ఉంటుందని సినీ వర్గాలు వెల్లడించాయి. 

వై.జి. మహేంద్రన్ కామెంట్స్‌తో మరింత వైరల్

అనిరుధ్ మామ, ప్రముఖ నటుడు వై.జి. మహేంద్రన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ పెళ్లి వార్తలకు మరింత బలం చేకూర్చాయి. అనిరుధ్ త్వరలోనే “చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోబోతున్నాడు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కావ్య మారన్ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ.. ఆమె తండ్రి నుంచి వ్యాపార నైపుణ్యాలను పొందారని, ఆమె మంచి సామర్థ్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఈ క్రమంలోనే అనిరుధ్–కావ్య ఇద్దరూ మంచి జోడీగా ఉంటారని కూడా మహేంద్రన్ అభిప్రాయపడ్డారు. అలా గతంలో వీరిద్దరి పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు..ఇప్పుడు పెళ్లి డేట్ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. ఏదేమైనా, అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

అనిరుధ్ సినిమాలపై ప్రభావం?

ప్రస్తుతం అనిరుధ్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. సౌత్ ఇండియాతో పాటు పాన్-ఇండియా స్థాయిలో అత్యంత బిజీగా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ప్రస్తుతం అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం ఆయన చేతిలో ‘జైలర్ 2’, ప్యారడైజ్, కింగ్ , రజినీకాంత్-కమల్ కాంబోలో ఓ రెండు సినిమాలు, దేవర 2 వంటి భారీ చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అందువల్ల పెళ్లి కోసం ఆయన తన పెండింగ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటున్నారనే ప్రచారం కూడా నడుస్తోంది. అయితే దీనిపై కూడా అనిరుధ్ టీమ్ నుంచి అధికారిక సమాచారం లేదు. కావ్య మారన్ విషయానికి వస్తే,  సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, అలాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వ్యాపార రంగంలో గుర్తింపు తెచ్చుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.