Reading Time: 3 minutes
Fairphone Gen 6 Launched With Removable Battery Ltpo Amoled Display 5 Year Warranty

Fairphone Gen. 6+: మాడ్యులర్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలలో ఒకటైన ఫెయిర్ ఫోన్ (Fairphone) నుండి కొత్తగా Fairphone (Gen. 6+)ను అధికారికంగా లాంచ్ చేసింది. రిపేరబిలిటీ, సస్టైనబిలిటీకి ప్రాధాన్యతనిస్తూ తాయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్‌తో కంపెనీ తొలిసారిగా అమెరికాలో నేరుగా అమ్మకాలను ప్రారంభించింది. వినియోగదారులు స్వయంగా మార్చుకోగల 12 భాగాలు, 10/10 iFixit రిపేరబిలిటీ స్కోర్, రిమూవబుల్ బ్యాటరీ, 2033 వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మరి వాటి పూర్తి వివరాలేంటో చూసేద్దామా..

LTPO AMOLED డిస్‌ప్లే:

ఫెయిర్ ఫోన్ Gen. 6+లో 6.31 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 1116 × 2484 పిక్సెల్స్ రిజల్యూషన్, 431ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. 10Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. HDR10, 10-బిట్ కలర్ సపోర్ట్‌తో పాటు 1,400 నిట్స్ వరకు ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. డిస్‌ప్లే రక్షణ కోసం 0.7mm కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఉపయోగించారు.

ప్రాసెసర్:

పనితీరు కోసం స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి 12GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్ గా ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రోSD కార్డు ద్వారా ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు.

Image (5)

సోనీ కెమెరా:

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు 50MP సోనీ LYTIA LYT-700C ప్రధాన కెమెరాను అందించారు. ఇందులో OIS, EIS సపోర్ట్ ఉంది. దీనికి 13MP అల్ట్రా-వైడ్ కెమెరా జతగా ఉంది. అల్ట్రా-వైడ్ కెమెరా 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూను అందిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP సాంసుంగ్ KD1 కెమెరా ఉంది. ప్రధాన కెమెరాతో 2x ఇన్-సెన్సర్ జూమ్, 10x వరకు డిజిటల్ జూమ్, RAW ఇమేజ్ క్యాప్చర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 30fps వద్ద 4K వీడియో రికార్డింగ్, 120fps వద్ద 1080p స్లో-మోషన్ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

రిమూవబుల్ బ్యాటరీ:

స్మార్ట్ ఫోన్స్ కు విరుద్ధంగా ఇందులో 4,415mAh రిమూవబుల్ బ్యాటరీ ఉంది. ఇది 27W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. గరిష్ఠంగా 30W పవర్‌ను అందిస్తుంది. కంపెనీ వివరాల ప్రకారం ఈ బ్యాటరీ 19 గంటల 38 నిమిషాల వరకు టాక్ టైమ్, 17 గంటల 59 నిమిషాల వెబ్ బ్రౌజింగ్, 14 గంటల 57 నిమిషాల వీడియో ప్లేబ్యాక్, 521 గంటల వరకు స్టాండ్‌బై టైమ్ అందిస్తుంది. ఛార్జింగ్ పరంగా 30 నిమిషాల్లో 50%, 45 నిమిషాల్లో 80%, 85 నిమిషాల్లో 100% వరకు ఛార్జ్ అవుతుంది.

2033 వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్:

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. మొత్తం 6 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు ఫెయిర్ ఫోన్ ప్రకటించింది. దీంతో 2033 వరకు సాఫ్ట్‌వేర్ సపోర్ట్ లభించనుంది. గూగుల్ సూట్, మై ఫెయిర్ ఫోన్ మినహా ఇతర థర్డ్-పార్టీ యాప్స్‌ను ముందుగా ఇన్‌స్టాల్ చేయలేదు. అలాగే “ఫెయిర్ ఫోన్ మూమెంట్స్” అనే ఫీచర్ ద్వారా అవసరమైనప్పుడు మినిమలిస్ట్ మోడ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా “ఫెయిర్ ఫోన్ గేలరీ” యాప్ ద్వారా ఫొటోలు, వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు.

రిపేర్ చేసుకోవడం చాలా సులభం:

Fairphone Gen. 6+లో కంపెనీ ప్రధానంగా రిపేరబిలిటీపై దృష్టి పెట్టింది. ఇందులో 12 వినియోగదారుడు రిప్లేస్ చేయగల భాగాలు ఉన్నాయి. ఒకే స్క్రూడ్రైవర్‌తో వీటిని మార్చుకోవచ్చు. USB-C పోర్ట్, బ్యాటరీ, డిస్‌ప్లే, బ్యాక్ కవర్ వంటి కీలక భాగాలను ఐదు నిమిషాల్లోపే మార్చుకునేలా డిజైన్ చేశారు. ఈ ఫోన్‌కు A రిపేరబిలిటీ రేటింగ్, iFixit నుంచి 10/10 స్కోర్ లభించింది. 2033 వరకు స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. మైక్రోఫోన్లు, సైడ్ బటన్లు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి భాగాలకు రిపేర్ సెంటర్ ద్వారా సర్వీసింగ్ సదుపాయం కూడా ఉంది.

డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఫోన్‌కు IP55 రేటింగ్ ఉంది. MIL-STD 810H ప్రమాణాల ప్రకారం కూడా దీనిని పరీక్షించారు. ఇందులో 1.5 మీటర్ల డ్రాప్ టెస్ట్, 1 మీటర్ ఎత్తు నుంచి 45 సార్లు రిపీట్ డ్రాప్ టెస్ట్ వంటి పరీక్షలు ఉన్నాయి. వీటితోపాటు 70,000కు పైగా బెండ్ టెస్టులు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. ఈ మొబైల్ కోబాల్ట్ బ్లూ, ఫారెస్ట్ గ్రీన్, హారిజన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 2010లో వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌లో కాన్ఫ్లిక్ట్ మినరల్స్‌పై అవగాహన కల్పించే క్యాంపెయిన్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత Fair Cobalt Allianceను సహ-స్థాపించి, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఆర్టిసనల్ కోబాల్ట్ మైన్లలో పని పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టింది.

ధర:

అమెరికాలో ఫెయిర్ ఫోన్ జెన్. 6+ ధర 649 డాలర్లుగా నిర్ణయించారు. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.62,135. ఫోన్ పూర్తిగా అన్‌లాక్ చేసి లభిస్తుంది. AT&T, T-మొబైల్ నెట్‌వర్క్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌పై ఐదేళ్ల వారంటీ అందిస్తున్నారు. అమెరికా మార్కెట్‌లో ఫోన్‌తో పాటు ప్రొటెక్టివ్ కేస్, ఫ్లిప్ కేస్, కార్డ్‌హోల్డర్, ఫింగర్ లూప్, లాన్యార్డ్, స్క్రీన్ ప్రొటెక్టర్ వంటి యాక్సెసరీస్‌ను కూడా అందిస్తోంది కంపెనీ. మొబైల్ తోపాటు ఫెయిర్ ఫోన్ ఫెయిర్ బడ్స్ 2 పేరుతో కొత్త మాడ్యులర్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను కూడా తీసుకవచ్చింది. ఇవి 2026 నాలుగో త్రైమాసికంలో విడుదల కానున్నాయి.