Reading Time: < 1 minute

కుంటాల వద్ద పర్యాటకుల సందడి.. వాటర్ ఫాల్స్ దగ్గర టూరిస్ట్ ల హడావిడి

Caption of Image.

నేరడిగొండ, వెలుగు: రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరున్న ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. దీంతో జలపాతం వద్ద టూరిస్ట్ సందడి నెలకొంది. శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో జలపాతం అందాలను తలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి పర్యాటకులు కుటుంబాలతో కలిసి తరలివచ్చారు. జలపాతం అందాలను చూస్తూ సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. జలపాతానికి వెళ్లే అటవీ ప్రాంతం సైతం పచ్చదనంతో పర్యాటకులకు కనువిందు చేస్తోంది.

©️ VIL Media Pvt Ltd.