
హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈయన కోసం చాలా మంది స్టార్ హీరోలు క్యూలో నిలబడ్డారు. అన్నింటికీ మించి నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నారు ఈ దర్శకుడు. అలాగే హనుమాన్ సినిమా సమయంలో సీక్వెల్ జై హనుమాన్ ఉంటుందని అనౌన్స్ చేశారు. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన హనుమాన్ సినిమా ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో జై హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో రాముడిగా నటించే నటుడు ఎవరు అంటూ టాక్ మొదలైంది. జై హనుమాన్ సినిమాలో రాముడు కూడా కనిపించనున్నాడని. అలాగే రాముడిగా ఓ స్టార్ హీరోగా నటిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. రాముడి పాత్రకోసం ప్రశాంత్ వర్మ చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ రామాయణం సినిమాలో రాముడిగా కనిపించనున్నాడు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా రాముడిగా కనిపించనున్నాడు.
దాంతో ఇప్పుడు రాముడి పాత్రల పై ఊహించని విధంగా అంచనాలు పెరిగిపోయాయి. రామాయణంలో రాముడిగా రణబీర్ సెట్ అయ్యాడు అని ఆడియన్స్ కు అనిపించినా.. రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ బాబును రాముడిగా చూడటానికి ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో జై హనుమాన్ సినిమాలో రాముడిగా ఎవరు కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఓ టాలీవుడ్ హీరోను సంప్రదిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే టాలీవుడ్ హీరోలు కాకపోతే కన్నడ నుంచి ఓ స్టార్ హీరోను రాముడిగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.