Reading Time: < 1 minute
Shraddha Kapoor Demands Profit Share For Ashneer Grover Biopic A New Era In Bollywood

బాలీవుడ్‌లో హీరోయిన్ల రెమ్యునరేషన్ పద్ధతుల్లోనూ, ప్రాజెక్ట్ డీల్స్‌లోనూ ఒక కొత్త విప్లవం మొదలైంది. సాధారణంగా స్టార్ హీరోయిన్లు ఒక సినిమా ఒప్పుకుంటే ముందే పారితోషికం డిమాండ్ చేసి తీసేసుకుంటారు. కానీ బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మాత్రం సరికొత్త రూట్ ఎంచుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అశ్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ కోసం శ్రద్ధా కపూర్‌కు దాదాపు 20 కోట్ల రూపాయల భారీ ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఫిక్స్డ్ అమౌంట్ తీసుకునే బదులు సినిమాలో ప్రొడ్యూసర్ క్రెడిట్‌తో పాటు బ్యాక్ ఎండ్ పార్టిసిపేషన్ అంటే సినిమా లాభాల్లో భాగస్వామ్యం అడుగుతున్నట్లు బి-టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో శ్రద్ధా వేస్తున్న ఈ అడుగు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం ఉన్న సినిమా మార్కెట్‌లో థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ, సాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో భారీగా రాబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కేవలం బడా హీరోలు మాత్రమే చేసే ‘ప్రాఫిట్ షేరింగ్’ ఒప్పందాలను ఇప్పుడు శ్రద్ధా కపూర్ వంటి స్టార్ హీరోయిన్లు కూడా అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ డీల్, ప్రొడ్యూసర్ క్రెడిట్ వివరాలు ఇంకా అధికారికంగా ఖరారు కానప్పటికీ… శ్రద్ధా కపూర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమైతే, రాబోయే రోజుల్లో ఇతర హీరోయిన్లు కూడా రాబోయే బయోపిక్‌లు, బిగ్ ప్రాజెక్ట్‌లలో ఇదే బిజినెస్ మోడల్‌ను ఫాలో అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. భారతీయ బిజినెస్ వరల్డ్‌లో తనదైన వివాదాలు, విజయాలతో నెట్టింట ట్రెండింగ్‌గా నిలిచిన అశ్నీర్ గ్రోవర్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్ ఒక పవర్ ఫుల్ రోల్ చేయనున్నారు. అశ్నీర్ భార్య ‘మాధురీ జైన్ గ్రోవర్’ పాత్రలో ఆమె కనిపించనున్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రాహుల్ మోడీ రచయితగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

ప్రజెంట్‌ శ్రద్ధా కపూర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక బయోపిక్ చిత్రం ‘ఈత’  మహారాష్ట్రకు చెందిన ప్రసిద్ధ లావణి, తమాషా జానపద రారాణి విఠాబాయి నారాయణగాంవకర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో, మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్ధ మునుపెన్నడూ చూడని డీ-గ్లామర్ అండ్ పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు.