
బాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కార్తీక్ ఆర్యాన్ తన కెరీర్‌లోనే అత్యంత బిజీ ఇయర్‌గా 2027 ని మార్చుకోబోతున్నాడు. వైవిధ్యమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి భారీ స్కెచ్ వేశాడు. ఇందులో భాగంగా మొదటగా రాబోతున్న చిత్రం ‘నాగ్జిల్లా’. వినూత్నమైన క్రీచర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఆ తర్వాత అదే ఏడాది ఆగష్టు 13న దేశభక్తి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఏవియేషన్ డ్రామా ‘కెప్టెన్ ఇండియా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
క్రీచర్ కామెడీ, ఏవియేషన్ థ్రిల్లర్సే కాకుండా రొమాన్స్, యాక్షన్ జానర్లను కూడా కార్తీక్ కవర్ చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో, టాలీవుడ్ భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. దీనితో పాటు ‘చందూ ఛాంపియన్’ వంటి హిట్ తర్వాత డైరెక్టర్ కబీర్ ఖాన్‌తో మరోసారి చేతులు కలిపాడు కార్తీక్. ఈ కాంబినేషన్‌లో ఒక పవర్ ప్యాక్డ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సిద్ధమవుతోంది. ఒకే సంవత్సరంలో క్రీచర్ కామెడీ, ఏవియేషన్ డ్రామా, రొమాంటిక్ మ్యూజికల్ మరియు స్పోర్ట్స్ యాక్షన్.. ఇలా నాలుగు వేర్వేరు జానర్లలో సినిమాలు చేయడం సాధారణ విషయం కాదు. ఈ నాలుగు సినిమాల పూర్తి విడుదల తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, 2027 సంవత్సరం మాత్రం కార్తీక్ ఆర్యాన్ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.