Reading Time: < 1 minute
Ss Rajamouli Varanasi Vijayendra Prasad Hints At Epic Rama Vs Kumbhakarna Style Battle

Varanasi: టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాలోనూ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్ లేదా ఓ ప్రత్యేకమైన ఎపిసోడ్ ఉండడం కామన్. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న “వారణాసి”లో సైతం భారీ సీక్వెన్స్ ఉండబోతోందని సినీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ వారణాసి సినిమా కథాంశంపై అదిరిపోయే హింట్స్ ఇచ్చారు.

రామాయణ బ్యాక్‌డ్రాప్‌.. రాముడు – కుంభకర్ణుడి యుద్ధం?

వారణాసి సినిమా ఈవెంట్లో.. సినిమాలోని 30 నిమిషాల నిడివి భారతదేశ సినిమా ఇండస్ట్రీని షేక్ చూస్తుంది అన్నారు కదా.. మరి మైథాలాజికలా, పొలిటికలా లేదా స్పిరిచువల్ కోణంలో సాగుతుందా? అని ప్రశ్నించగా.. అందుకు విజయేంద్ర ప్రసాద్ అందుకు నవ్వుతూ.. “ఇది రాముడికి, కుంభకర్ణుడికి మధ్య జరిగే యుద్ధం లాంటిది” అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా.. ఇదివరకే విడుదలైన టీజర్ గ్లింప్స్‌ లో కుంభకర్ణుడి లాంటి విజువల్, దానికి ఎదురునిలిచే రాముడి లాంటి హీరో మీకు కనిపించే ఉంటారని అన్నారు. అలాగే ఇందులో ఆంజనేయ స్వామి తోక, దానిపై రథం వెళ్లే సీన్లను కూడా ఆయన ప్రస్తావిస్తూ.. సినిమాలోని మైథాలజీ కనెక్టివిటీపై పరోక్షంగా హింట్ ఇవ్వగానే ఇచ్చేసారు.

మల్టిపుల్ టైమ్ జోన్స్ (Time Zones):

రాజమౌళి గత చిత్రాలైన ‘మగధీర’, ‘ఈగ’ సినిమాల్లో పునర్జన్మలు లేదా టైమ్ ట్రావెల్ వంటివి ఉన్నప్పటికీ.. మహేష్ బాబుతో చేయబోయే వారణాసి సినిమాలో చాలా లేయర్స్, అలాగే విభిన్నమైన టైమ్ జోన్స్ (Time Zones) ఉండబోతున్నాయా? అని ప్రశ్నించగా.. ‘మగధీర’ కంటే ఎక్కువ కాలాల (టైమ్ పీరియడ్స్) నేపథ్యంలో ఈ కథ ఉండబోతుందని తెలిపారు. అలాగే ఈ నిర్ణయం మీదా లేక రాజమౌళిదా? అని అడగగా.. అందుకు విజయేంద్ర ప్రసాద్ సమయస్ఫూర్తితో.. “దాని గురించి ప్రస్తుతం ఎక్కువగా మాట్లాడకూడదు” అంటూ సున్నితంగా దాటవేశారు. మొత్తంగా ఈ చిన్న హింట్స్‌ వారణాసి సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా, మన భారతీయ పురాణాల స్ఫూర్తితో ఈ అడ్వెంచర్ రైడ్‌ ను జక్కన్న భారీగా ప్లాన్ చేస్తున్నట్లు కనపడుతుంది.