
‘పెద్ది’ సినిమాలో తలారి ఆంబ్రోస్ క్యారెక్టర్లో నటించి మెప్పించిన నటుడి పేరు శిబిన్ ఎస్ రాఘవ్. ఇతను ఒక మలయాళ నటుడు. లోక చాప్టర్-1 సినిమాతో శిబిన్కు మంచి గుర్తింపు దక్కింది. ‘పెద్ది’ సినిమాలో శిబిన్ కనిపించేది కాసేపే అయినప్పటికీ ఆంబ్రోస్ పాత్రలో శిబిన్ నటన కచ్చితంగా గుర్తుండిపోతుంది.
‘పెద్ది’ సినిమాలో తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ‘ఎక్స్’ వేదికగా దర్శకుడు బుచ్చిబాబుకు శిబిన్ థ్యాంక్స్ చెప్పాడు. రాంచరణ్తో నటించడం తన కల అని.. ఆ కలను నిజం చేసినందుకు దర్శకనిర్మాతలకు శిబిన్ ధన్యవాదాలు తెలిపాడు.
Thanks alott for choosing me as #Bobbili player #Talari_Ambrose in #Peddi,
Its a dream for me to act with my favourite #Ramcharan annaThanks for fulfilling my dream @BuchiBabuSana @MythriOfficial @vriddhicinemas.#BlockbusterPeddi pic.twitter.com/oUfz6nkdv8
— ShibinSRaghav (@ShibinSRaghav) June 5, 2026
ఆంబ్రోస్ క్యారెక్టర్లో మనోడి నటనకు ప్రేక్షకులు ఫిదా అవడం ఖాయం. ఎంతసేపు నిడివి ఉన్న పాత్ర దొరికిందనేది ముఖ్యం కాదని ఆ పాత్రకు ఎంత న్యాయం చేయగలిగామన్నది ముఖ్యమని శిబిన్ ‘పెద్ది’ సినిమాతో నిరూపించుకున్నాడు. ‘పెద్ది’ సినిమాలోని ‘ఆంబ్రోస్’ క్యారెక్టర్లో శిబిన్ నటించలేదని.. జీవించేశాడని ప్రేక్షకులు కితాబిచ్చారు. శిబిన్ ఎస్ రాఘవ్ కేవలం నటుడు మాత్రమే కాదు డ్యాన్సర్ కూడా.
లోక చాప్టర్-1 సినిమాలో శిబిన్ చేసింది సైలెంట్ రోల్. ఒక్క డైలాగ్ కూడా ఉండదు. కానీ.. శిబిన్ చేసిన ఈ Mister Nobody క్యారెక్టర్ ఎంత ట్రెండ్ అయిందంటే.. సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా హాట్ టాపిక్ అయింది. ‘పెద్ది’ సినిమాలో శిబిన్ చేసిన క్యారెక్టర్ ఏంటో తెలియాలంటే ‘పెద్ది’ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక.. ‘పెద్ది’ సినిమా విషయానికొస్తే.. ‘ఉప్పెన’ తర్వాత దాదాపు 5 ఏళ్ల గ్యాప్‌తో దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సినిమా ‘పెద్ది’. తన గురువు సుకుమార్ చొరవతో రామ్ చరణ్‌కు బుచ్చిబాబు ఈ కథ చెప్పాడు. కథ వినగానే రాంచరణ్కు నచ్చడంతో ‘పెద్ది’ సినిమా పట్టాలెక్కింది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ కావడంతో చరణ్ ప్రత్యేక శిక్షణలు తీసుకున్నారు. క్రికెట్ అందరికీ తెలిసిన ఆటే. కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
‘దంగల్’ చిత్రంలో అమీర్ ఖాన్‌కి కోచింగ్ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చారు. అలాగే తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశారు. ఆర్టిస్టులందరికీ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రామ్ చరణ్ ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు ప్రత్యేకంగా పహిల్వాన్ శిక్షణ తీసుకున్నాడు. సినిమాలో కుస్తీ, క్రికెట్ రెండూ ఉన్నప్పటికీ భావోద్వేగాలే ప్రధాన బలం. ‘పెద్ది’ సినిమా విజయనగరం నేపథ్యంలోని 1985 కాలం ఫిక్షనల్ కథగా సాగుతుంది.