Reading Time: < 1 minute
Ram Charan Starrer Peddi Becomes All Time Top 4th Opener In Ralayaseema But Couldnt Cross The Devara

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవైటేడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 135. 36 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టి ఈ చిత్రం సంచలనం సృష్టించింది. దాదాపు అన్ని ఏరియాలలో సాలిడ్ ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’.. రాయలసీమ (సీడెడ్) రీజియన్‌లో మాత్రం మిగతా ఏరియాలతో పోలిస్తే కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ, ఓవరాల్‌గా టాప్ రికార్డుల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.

రాయలసీమ ఏరియాలో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘పెద్ది’ రూ. 7.70 కోట్ల షేర్ వసూళ్లతో ఆల్‌టైమ్ టాప్ 4వ స్థానంలో నిలిచింది. రామ్ చరణ్ మాస్ క్రేజ్ కారణంగా సీడెడ్ వ్యాప్తంగా థియేటర్లలో భారీ హంగామా కనిపించింది. ఈ కలెక్షన్లతో చరణ్ మరోసారి రాయలసీమ బాక్సాఫీస్ వద్ద తన స్టామినాను నిరూపించుకున్నాడు. అయితే రాయలసీమ డే-1 కలెక్షన్ల చార్ట్‌లో ఇప్పటికీ ఎస్.ఎస్. రాజమౌళి విజువల్ వండర్ ‘RRR’ రూ. 17 కోట్లతో మొదటి స్థానంలో అజేయంగా కొనసాగుతోంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ రూ. 12.15 కోట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ రూ. 10.40 కోట్ల వసూళ్లతో ఆల్‌టైమ్ టాప్ 3వ స్థానాన్ని దక్కించుకోగా ఇప్పుడు రామ్ చరణ్ ‘పెద్ది’ రూ. 7.70 కోట్లతో నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా లాంగ్ రన్‌లో రాయలసీమలో మరిన్ని వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.